Tech Hub | భ‌విష్య‌త్తు టెక్ హ‌బ్‌లుగా విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌.. నాస్కామ్ నివేదిక‌లో వెల్ల‌డి

Tech Hub | రానున్న రోజుల్లో తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ న‌గ‌రాలు టెక్ హ‌బ్ (Tech Hub) లుగా అభివృద్ధి చెందుతాయని నాస్కామ్ (NASSCOM) నివేదిక వెల్ల‌డించింది. దేశవ్యాప్తంగా మొత్తం 26 న‌గ‌రాలకు ఈ అవ‌కాశం ఉండ‌గా.. వాటిలో ఈ మూడు న‌గ‌రాలూ ఉన్నాయ‌ని పేర్కొంది. డెలాయిట్‌, నాస్కామ్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం.. ప్ర‌స్తుతం విశాఖ‌లో 250కి పైగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) సంస్థ‌లు కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయి. అదే విజ‌య‌వాడ‌లో వీటి సంఖ్య […]

  • Publish Date - September 4, 2023 / 09:43 AM IST

Tech Hub |

రానున్న రోజుల్లో తిరుప‌తి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ న‌గ‌రాలు టెక్ హ‌బ్ (Tech Hub) లుగా అభివృద్ధి చెందుతాయని నాస్కామ్ (NASSCOM) నివేదిక వెల్ల‌డించింది. దేశవ్యాప్తంగా మొత్తం 26 న‌గ‌రాలకు ఈ అవ‌కాశం ఉండ‌గా.. వాటిలో ఈ మూడు న‌గ‌రాలూ ఉన్నాయ‌ని పేర్కొంది.

డెలాయిట్‌, నాస్కామ్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం.. ప్ర‌స్తుతం విశాఖ‌లో 250కి పైగా బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) సంస్థ‌లు కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయి. అదే విజ‌య‌వాడ‌లో వీటి సంఖ్య మ‌ధ్య‌స్థంగా ఉంది.

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు వంటి టైర్ 1 న‌గ‌రాల్లో ఉన్న ఇదే త‌ర‌హా సంస్థ‌ల‌తో పోలిస్తే.. విశాఖ వంటి టైర్ న‌గ‌రాల్లో లాభాల మార్జిన్లు 40 శాతం అధికంగా ఉన్నాయి. త‌క్కువ అద్దెలు, నిపుణులు త‌క్కువ జీతాల‌కే ల‌భించడం దీనికి ప్రధాన కార‌ణాలు.

ఈ కార‌ణాలే విశాఖ‌, తిరుప‌తి, విజ‌య‌వాడ న‌గ‌రాలు టెక్ హ‌బ్‌లుగా ఎదిగేందుకు చోద‌కాలుగా ప‌ని చేయ‌నున్నాయి. కేవ‌లం ఆర్థిక ప‌రంగానే కాకుండా పెద్ద సంఖ్య‌లో స్టార్ట‌ప్‌ల‌తో సృజ‌న ప‌రంగానూ టైర్ 2 న‌గ‌రాలు పెద్ద సంస్థ‌ల‌ను ఆక‌ర్షిస్తున్నాయి.

ఉదాహ‌ర‌ణ‌కు విశాఖ‌నే తీసుకుంటే ఇక్క‌డ సుమారు 1,120 స్టార్ట‌ప్‌లు కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్నాయి. అందులో 20 శాతం టెక్ సంస్థ‌లే కావ‌డం విశేషం. మ‌రోవైపు విజ‌యవాడ‌లో వివిధ టెక్ నైపుణ్యాలు ఉన్న వారు 25 వేల మంది వ‌ర‌కు ఉండొచ్చ‌ని నాస్కామ్ త‌న అధ్య‌య‌నంలో పేర్కొంది.

ఆంధ్ర యూనివ‌ర్సిటీ , తిరుప‌తి ఐఐటీ, ఐఐఎం విశాఖ‌ప‌ట్నం, ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎన‌ర్జీ, ఐఐటీడీఎం కర్నూలు వంటి వంటి ప్ర‌సిద్ధి చెందిన విశ్వ‌విద్యాల‌యాలు ఉండ‌టమూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు క‌లిసి రానుంద‌ని త‌న అధ్య‌య‌నంలో స్ప‌ష్టం చేసింది.

Latest News