Vishal | చావు తృటిలో త‌ప్పింది.. భ‌యంక‌ర ఘ‌ట‌న గురించి చెప్పిన విశాల్!

Vishal: త‌మిళ స్టార్ హీరో విశాల్ ఇటీవ‌ల ఎక్కువగా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. సినిమా షూటింగ్స్‌లో గాయ‌ప‌డ‌డం, లేదంటే ఫ‌లానా యువ‌తిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్త‌లు రావ‌డంతో ఆయ‌న పేరు ప‌లు మీడియాల‌లో మారుమ్రోగిపోతుంది. విశ‌ల్ పెళ్లిపై అయితే లెక్క‌లేనన్ని రూమ‌ర్స్ వ‌స్తుంటాయి. గ‌తంలో నటి అభియనతో విశాల్ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జ‌రిగింది. ఈ రూమర్లను ఇటు విశాల్ పీఆర్ టీమ్‌తో పాటు అటు అభినయ కూడా పూర్తిగా ఖండించారు. అనంతరం వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో విశాల్ రిలేషన్‌షిప్‌లో […]

  • Publish Date - August 12, 2023 / 10:25 AM IST

Vishal:

త‌మిళ స్టార్ హీరో విశాల్ ఇటీవ‌ల ఎక్కువగా వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. సినిమా షూటింగ్స్‌లో గాయ‌ప‌డ‌డం, లేదంటే ఫ‌లానా యువ‌తిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్త‌లు రావ‌డంతో ఆయ‌న పేరు ప‌లు మీడియాల‌లో మారుమ్రోగిపోతుంది. విశ‌ల్ పెళ్లిపై అయితే లెక్క‌లేనన్ని రూమ‌ర్స్ వ‌స్తుంటాయి. గ‌తంలో నటి అభియనతో విశాల్ డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జ‌రిగింది.

ఈ రూమర్లను ఇటు విశాల్ పీఆర్ టీమ్‌తో పాటు అటు అభినయ కూడా పూర్తిగా ఖండించారు. అనంతరం వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో విశాల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాంటూ పుకార్లు పుట్టించారు. నడిగర్ సంఘం ఎన్నికల సమయంలో వరలక్ష్మి తండ్రి శరత్‌కుమార్‌తో విశాల్‌కు జరిగిన గొడవల కారణంగా వీరి మధ్య పెరిగింద‌ని కూడా చెప్పుకొచ్చారు.

రీసెంట్ గా లక్ష్మీ మీనన్ పెళ్లి జ‌ర‌గ‌నుందంటూ వార్త‌లు రాగా, వాటిని విశాల్ స్వ‌యంగా ఖండించారు. ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌తో ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్ ప్రేక్ష‌కులని అల‌రించిన విశాల్ త్వ‌ర‌లో మార్క్ ఆంటోని చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇందులో ప్రతినాయకుడిగా ఎస్ జె సూర్య నటిస్తుండ‌గా, ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌క‌డుఉ GV ప్రకాష్ బాణీలు అందిస్తున్నారు. సెప్టెంబర్ 15న చిత్రాన్ని రిలీజ్ చేసే ప్లాన్ చేయ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్ వేగవంతం వేశారు. ఈ క్ర‌మంలో విశాల్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. ఈ చిత్ర షూటింగ్ స‌మ‌యంలో తాను తృటిలో చావు నుంచి తప్పించుకున్నట్లు స్ప‌ష్టం చేశాడు.

చిత్ర షూటింగ్ స‌మ‌యంలో ఫైట్ ముగిసిన వెంట‌నే నేను విశ్రాంతి తీసుకుంటున్నా. అప్పుడు ఒక పెద్ద ట్ర‌క్ నా వైపుకి దూసుకొచ్చంది. అప్పుడు నేను గ‌మ‌నించి ప‌క్క‌కు త‌ప్పుకున్నాను. అయితే ఆ ట్ర‌క్కు బ‌లంగా సెట్‌ని వెళ్లి ఢీకొట్టింది. మొత్తానికి ఆ ట్రక్కు నుంచి నేను త‌ప్పించుకున్నాన‌ని, పది నిమిషాల పాటు తేరుకోలేదని అన్నారు.

నా సిబ్బంది వచ్చి మాట్లాడించిన కూడా 10 నిముషాలు నన్ను డిస్ట్ర‌బ్ చేయ‌వ‌ద్దని చెప్పాను. ఆ ఘ‌ట‌న‌ అంత భయాన్ని కలిగించింది అని విశాల్ చెప్పుకొచ్చాడు. ఇక ఎస్ జె సూర్య గురించి మాట్లాడిన సూర్య తనని సొంత తమ్ముడిలా చూసుకుంటారు ని చెప్పుకొచ్చారు. అందరూ హీరో కోసం వెతికితే, నేను మాత్రం సూర్య కోసం వెతుకుతాన‌ని ఆయ‌న చెప్ప‌డం విశేషం.

Latest News