Vishwak Sen | తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం.. విశ్వక్ సేన్ వార్నింగ్..!

<p>Vishwak Sen: దాస్ కా ధమ్కీ విశ్వ‌క్ సేన్ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల‌ని అల‌రిస్తున్నాడు. మ‌రోవైపు వివాదాల‌తో వార్త‌లలో నిలుస్తున్నాడు. టీవీ9 యాంక‌ర్‌తో వివాదం, ఆ త‌ర్వాత రీసెంట్‌గా బేబి ద‌ర్శ‌కుడు సాయి రాజేష్‌తో మాట‌ల వివాదం విశ్వ‌క్ సేన్‌ని వార్త‌ల‌లోకి ఎక్కేలా చేసింది. ఇక తాజాగా విశ్వ‌క్ సేన్ తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అంటూ గ‌ట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇలా ఎవ‌రికి ఇచ్చాడు అనే క‌దా మీ డౌట్. విశ్వక్ సేన్ ఇంత ప‌వ‌ర్ […]</p>

Vishwak Sen: దాస్ కా ధమ్కీ విశ్వ‌క్ సేన్ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల‌ని అల‌రిస్తున్నాడు. మ‌రోవైపు వివాదాల‌తో వార్త‌లలో నిలుస్తున్నాడు. టీవీ9 యాంక‌ర్‌తో వివాదం, ఆ త‌ర్వాత రీసెంట్‌గా బేబి ద‌ర్శ‌కుడు సాయి రాజేష్‌తో మాట‌ల వివాదం విశ్వ‌క్ సేన్‌ని వార్త‌ల‌లోకి ఎక్కేలా చేసింది. ఇక తాజాగా విశ్వ‌క్ సేన్ తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం అంటూ గ‌ట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. ఇలా ఎవ‌రికి ఇచ్చాడు అనే క‌దా మీ డౌట్. విశ్వక్ సేన్ ఇంత ప‌వ‌ర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చింది రీల్ లైఫ్‌లో, రియ‌ల్ లైఫ్‌లో కాదు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న విశ్వ‌క్ సేన్.. పాటల రచయిత నుంచి దర్శకుడుగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ అఫ్ గోదావరి అనే చిత్రం చేస్తున్నాడు.

అంజలి, నేహశెట్టి హీరోయిన్స్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విశ్వక్‌సేన్, అంజలి ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయ‌గా, వాటిని చూసి పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామా అని చెప్పేశారు. ఇక తాజాగా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ చూస్తుంటే గోదావరి జిలాల్లో జరిగే మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం అంటూ విశ్వక్‌సేన్ మాస్ డైలాగ్ చెప్పి సినిమాపై అంచనాలు పెంచాడు.ఇది ఒక ఊళ్ళో జరిగే పొలిటికల్ డ్రామాలా ఉంది.

అయితే తెలంగాణ కుర్రోడు అయిన విశ్వక్ స‌డెన్ గోదావ‌రిపై సినిమా ప్రకటించడంతో అంచనాలు పెరిగాయి. శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చిత్ర‌ టైటిల్ చూస్తే హిందీలో అనురాగ్ క‌శ్య‌ప్ తీసిన గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సేపూర్ గుర్తుకు వ‌స్తుంది. ఈ సినిమా కూడా దాన్ని గుర్తుకు చేసేలా రా అండ్ ర‌స్టిక్‌గా ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. 1980 స‌మ‌యంలో గోదావ‌రి పరివాహక ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ వార్స్‌, ముఠా త‌గాదాలు, రౌడీయిజం చుట్టూ ఈ క‌థ‌ని అల్లినట్లు తెలుస్తుంది. చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా స్వ‌రాలు అందిస్తున్నారు . ఈ సినిమాకి త్రివిక్ర‌మ్ స‌ల‌హాలూ, సూచ‌న‌లూ, స‌పోర్ట్ ఉందని టాక్. ఈ సినిమాతో విశ్వక్ సేన్ మంచి హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నాడు.

Latest News