Site icon vidhaatha

వాట్సాప్‌ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోకి షేర్‌ చేయాలనుకుంటున్నారా..? ఈ సింపుల్‌ స్టెప్స్‌ను ఫాలోకండి..!

WhatsApp Status | ఇన్‌స్టంట్‌ మెసెజ్‌ యాప్‌ వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగానే భారీగా వినియోగిస్తుంటారు. వాట్సాప్‌ను వినియోగించే ప్రతి ఒక్కరిలో ఎప్పుడూ ఒకసారైనా వాట్సాప్‌ స్టేటస్‌ను పెట్టే ఉంటారు. లేదంటే స్టేటస్‌లను చూస్తూనే ఉంటారు. అయితే, ఈ స్టేటస్‌ను సోషల్‌ మీడియాల్లోకి షేర్‌ చేసేందుకు ఇప్పటి వరకు అవకాశం లేదు కానీ.. తొలిసారిగా ఫేస్‌బుక్‌లోకి షేర్‌ చేసుకొనేందుకు మెటా కంపెనీ ఫీచర్‌ను తీసుకువచ్చింది. వీరు సైతం మీ వాట్సాప్‌ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోకి మీ స్టేటస్‌ను ఫేస్‌బుక్‌ స్టోరీకి షేర్‌ చేయాలనుకుంటున్నారా..? అయితే అదెలాగో తెలుసుకుందాం రండి..!


ఫేస్‌బుక్‌లోకి ఎలా షేర్‌ చేయాలంటే..


మొదట మొబైల్‌లో వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి. సెట్టింగ్‌లోకి వెళ్లి అకౌంట్స్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత లింక్‌డ్‌ అకౌంట్స్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. లింక్డ్ అకౌంట్స్‌లో ఫేస్‌బుక్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను లింక్‌ చేసేందుకు స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించాలి. ఫేస్‌బుక్‌ అకౌంట్‌ లింక్‌ అయ్యాక మీ వాట్సాప్‌ స్టేటస్‌ను సులభంగా ఫేస్‌బుక్‌లోకి షేర్‌ చేసుకోవచ్చు.


ఆండ్రాయిడ్‌లో..


ఆండ్రాయిడ్‌ వాట్సాప్‌ స్టేటస్‌ను ఎలా షేర్‌ చేయాలో ఈ టిప్స్‌ను ఫాలో కండి. మొదట వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి అప్‌డేట్స్‌లోకి వెళ్లాలి. స్టేటస్‌ హెడర్‌లోని మై స్టేటస్‌ను ట్యాప్‌ చేసి.. స్టేటస్‌ను క్రియేట్‌ చేయాలి. మీరు షేర్ చేయాలనుకుంటున్న స్టేటస్ అప్‌డేట్ పక్కన ఉన్న ‘మోర్‌’పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత షేర్‌ టూ ఫేస్‌బుక్‌ని సెలెక్ట్‌ చేసుకోవాలి. అనంతరం షేర్‌ నౌను సెలెక్ట్‌ చేశారంటూ.. మీ వాట్సాప్‌ స్టేటస్‌ ఫేస్‌బుక్‌లోకి షేర్‌ అవుతుంది.


ఐఓఎస్‌ యూజర్లు..


ఐఫోన్స్‌ యూజర్లు.. వాట్సాప్ ను ఓపెన్ చేసి అప్‌డేట్స్‌లోకి వెళ్లాలి. స్టేటస్ హెడర్‌లోని మై స్టేటస్‌ని ట్యాప్ చేసి, స్టేటస్‌ క్రియేటర్‌ చేయాలి. మీరు షేర్ చేయాలనుకుంటున్న స్టేటస్ అప్‌డేట్ రన్ అవుతున్న సమయంలో ‘ఐ ఐకాన్‌’పై క్లిక్‌ చేయాలి. డ్రాప్‌ డౌన్‌ మెన్యూలో ఉన్న మోర్‌పై క్లిక్‌ చేయాలి. షేర్‌ టూ ఫేస్‌ బుక్‌ని సెలెక్ట్‌ చేసుకోని.. షేర్‌ నౌ సెలెక్ట్‌ చేయాలి. దాంతో వాట్సాప్‌ స్టేటస్‌ ఫేస్‌బుక్‌లోకి షేర్‌ అవుతుంది.

Exit mobile version