Site icon vidhaatha

Warangal | KUలో విద్యార్థుల‌తో మాట్లాడిన భట్టి.. గోడు వెళ్లబోసుకున్న విద్యార్థులు

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పీపుల్స్ మార్చ్ పాద‌యాత్రలో భాగంగా కాకతీయ యూనివ‌ర్సిటీకి వెళ్లిన సీఎల్పీ నేత దృష్టికి విద్యార్థులు తమ సమస్యలు తీసుకువ‌చ్చారు. సూర్యాపేట‌కు చెందిన రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాలన్నారు.

మ‌రో విద్యార్థి డోంగ్రూ క‌చ్రూ మా విద్యార్థుల ల‌క్ష్యాన్ని కేసీఆర్ ప్ర‌భుత్వం ల‌క్ష‌ల‌కు అమ్ముకుంటోంద‌ని వేద‌న‌గా చెప్పారు. విద్యార్థి రాకేష్ మాట్లాడుతూ.. లైబ్రరీలో పుస్తకాలు లేవు, భోజనం బాగుండం లేదు.. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదన్నారు.

అనంత‌రం సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ ఎన్నో ఉద్య‌మాల‌కు, భావ‌జాలాల‌కు, సామాజిక మార్పుల‌కు వేదిక‌గా నిలిచిన వర్సిటీలో ఉమ్మ‌డి రాష్ట్రంతో పోలిస్తే ఇప్పుడే స‌మ‌స్య‌లు, ఇబ్బందులు ఎక్కువ‌గా ఉండ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

నేను పాద‌యాత్ర‌గా న‌డిచి వ‌చ్చిన ప్ర‌తి ప‌ల్లెలో ఎక్క‌డా తెలంగాణ ఆశ‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేర‌లేదు. ఈ ప్ర‌భుత్వాన్ని వ‌దిలించుకోవాల‌న్న కోపం, బాధ ప్ర‌జ‌ల్లో స్ప‌ష్టంగా కనిపించింది. తెలంగాణ ఉద్య‌మ‌మంతా భూమి కోసం, భుక్తి కోసం.. విముక్త కోస‌మే సాగింది.

నీళ్లు, నీధులు, నియామ‌కాలు, ఆత్మ గౌర‌వం వ‌స్తుంద‌న్న ఆలోచ‌న‌తో మ‌లిద‌శ ఉద్య‌మం వ‌చ్చింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలంగాణ ఏర్పాటు చేసింది. ధ‌ర‌ణి పేరుతో కాంగ్రెస్ పంచిన భూముల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం వెన‌క్కు తీసుకుంది.

నీళ్లు లేవు.. నిధులు లేవు.. నియ‌మకాలు లేకుండా చేశారు. ల‌క్షా 20 వేల ఉద్యోగాలున్న సింగ‌రేణిలో ప్ర‌స్తుతం 42 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ప్ర‌భుత్వంలో ఖాళీగా ఉన్న 2 ల‌క్ష‌ల ఉద్యోగాల ల‌క్ష్యాన్ని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం దెబ్బ‌తీసింది. నీళ్లు, నిధులు, నియాక‌మాలు, ఆత్మ‌గౌర‌వం, తెలంగాణ ల‌క్ష్యాలు నెర‌వేరేవ‌ర‌కూ విద్యార్థి లోకం పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తొమ్మిదిన్న‌ర ఏళ్ల‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఒక్క వ‌ర్సిటీని ఏర్పాటు చేయ‌లేదు. ఉన్న ప్ర‌భుత్వ వ‌ర్సిటీల‌ను నిర్వీర్యం చేసే కుట్ర‌ను బీఆర్ఎస్ అమ‌లు చేస్తోంది. కేసీఆర్ ఇలాగే కొనసాగితే వ‌ర్సిటీ భూముల‌ను కూడా అమ్మేస్తాడు. మేడిగ‌డ్డ‌, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి అద‌నంగా ఒక్క ఎక‌రాకు సాగునీరు పార‌లేదు.

వ‌రంగ‌ల్ జిల్లాలో సాగుకు అందుతున్న నీళ్ల‌న్ని కాక‌తీయ కాలువ‌, దేవాదుల ఎత్తిపోత ప‌థ‌కం ఫేజ్ 1 నుంచేన‌ని నేను స‌వాల్ చేసి చెబుతున్నా. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆత్మ‌గౌర‌వం లేకుండా 70 ఏళ్ల‌నాటి ఫ్యూడ‌ల్ వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించేలా బీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తోంది. త్వ‌ర‌లో టీ.ఎస్.పీ.ఎ.ఎస్సీ ర‌ద్దుకు రాష్ట్ర‌ప‌తికి లేఖ రాస్తాను అని తెలిపారు.

Exit mobile version