Site icon vidhaatha

Warangal: సౌత్ ఏషియా రీజనల్ కాన్ఫరెన్స్‌కు వరంగల్ మేయర్ గుండు సుధారాణి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నేపాల్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సౌత్ ఏషియా రీజనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి నగర మేయర్ గుండు సుధారాణి సోమవారం నేపాల్ దేశంలోని ఖాట్మండుకు బయలుదేరి వెళ్ళారు.

యునైటెడ్ సిటీస్, స్థానిక ప్రభుత్వాలు ఆసియా పసిఫిక్(UCLG ASPAC), మునిసిపల్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (MUAN), ఖాట్మండు మెట్రోపాలిటన్ సిటీ, లలిత్‌పూర్ మెట్రోపాలిటన్ సిటీ, ధులిఖేల్ మునిసిపాలిటీ సంయుక్తంగా కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.

ఈ నేపథ్యంలో దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలికి చెందిన (SAARK ) 7 దేశాలలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతినిధులు పాల్గొనే ఈ కాన్ఫరెన్స్ నేటి నుండి 13వ తేదీ వరకు జరుగనున్నది. ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు వరంగల్ నుండి నగర మేయర్ గుండు సుధారాణి ప్రాతినిధ్యం వహించనున్నారు. వరంగల్ నగరంలో బల్దియా అవలంబిస్తున్న ఉత్తమ శానిటేషన్ విధానం పైన ప్రజెంటేషన్ చేస్తారు.

Exit mobile version