Warangal | మంత్రి KTR పర్యటన.. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి, MLA

Warangal రూ. 618 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బహిరంగ సభను జయప్రదం చేయాలి అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం వరంగల్‌కు రానున్నట్లు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12గంటలకు మంత్రి వచ్చి సాయంత్రం 6 గంటల వరకు రూ. 618 కోట్ల […]

  • Publish Date - June 16, 2023 / 01:28 AM IST

Warangal

  • రూ. 618 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • బహిరంగ సభను జయప్రదం చేయాలి
  • అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలి
  • తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం వరంగల్‌కు రానున్నట్లు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. వరంగల్ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12గంటలకు మంత్రి వచ్చి సాయంత్రం 6 గంటల వరకు రూ. 618 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరపనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వరంగల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా సంగెం మండలంలో నిర్మించిన మెగా టెక్స్టైల్ పార్కు ప్రారంభోత్సవం వుందని అన్నారు. వరంగల్ సమీకృత కలెక్టర్ భవనానికి భూమి పూజ అనంతరం ఓసిటీలోని బిఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ ప్రారంభిస్తారు అన్నారు. దేశాయి పేట లో ఉమెన్ హాస్టల్ భవనం ప్రారభోత్సవం, జర్నలిస్ట్ డబుల్ బెడ్ రూమ్ ల ప్రారంభోత్సవం వుంటంది అన్నారు. వరంగల్ తూర్పులో రూ.620 కోట్లతో స్మార్ట్ రోడ్లు, ఉర్సు బండ్ నిర్మాణం, వరంగల్ బస్టాండ్ నిర్మాణం, రింగ్ రోడ్డు పనుల తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు అన్నారు.

కాంగ్రెస్ పాలనలో వరంగల్ నిర్లక్ష్యం

కాంగ్రెస్ పాలనలో వరంగల్ కేవలం కార్మికులను తయారు చేసే కార్ఖానగానే ఉండిపోయిందని ఎమ్మెల్యే నరేందర్ విమర్శించారు. ఎక్కడా లేని విధంగా 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నదన్నారు. వరంగల్ హెల్త్ సిటీగా అద్భుతంగా రూపుదిద్దుకోనున్నట్లు తెలిపారు. తూర్పులో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నందున వచ్చే ఎన్నికల్లో గెలిపించి కానుకగా ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.

మిల్లు గ్రౌండ్లో భారీ సభ

కలెక్టరేట్ భవన నిర్మాణం జరిగే అజం జాహి మిల్లు గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుందని, ఇందులో ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సభను పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం కావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో కుడా చైర్మన్ సుందర్ రాజు యాదవ్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

సభ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా వరంగల్ అజం జాహి మిల్లు గ్రౌండ్లో శనివారం సాయంత్రం నిర్వహించే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి, స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో కలిసి పరిశీలించారు. వేదిక ఏర్పాటు, హాజరయ్యే ప్రజల కోసం అవసరమైన వసతులపై చర్చించారు.

ఎలాంటి ఆటంకాలు లేకుండా, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

Latest News