Warangal | అమరవీరులకు ఘన నివాళులు

Warangal నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు అమరుల త్యాగం ఉన్నతమైంది పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. హనుమకొండ లో అమరవీరుల స్తూపానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి , రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు […]

  • Publish Date - June 22, 2023 / 01:11 PM IST

Warangal

  • నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు
  • అమరుల త్యాగం ఉన్నతమైంది
  • పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. హనుమకొండ లో అమరవీరుల స్తూపానికి రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి , రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావీణ్య, సిపి రంగనాథ్ తదితరులతో కలిసి నివాళులు అర్పించారు. మానుకోటలో మంత్రి సత్యవతి రాథోడ్, నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాల అమరధామంలో చల్లా ధర్మారెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు.

మహనీయులు కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఆ తరువాత హనుమకొండ కలెక్టరేట్ లో జరిగిన హనుమకొండ, వరంగల్ జిల్లాల అమరవీరుల కుటుంబాలకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది అమరవీరుల త్యాగాలతో ఏర్పడింది.

అసువులు బాసిన వీరులను మనం మరచిపోలేం.ఇప్పటికీ ఉద్యమ రోజులు గుర్తు వస్తె బాధ అన్పిస్తుంది. తాము నష్టపోయినా తరువాతి తరాలు తెలంగాణ రాష్ట్రంలో బాగుపడాలి అని వీర మరణం పొందారు. వారికి మనం ఏమి చేసినా తక్కువే, అమరవీరుల పథకం కింద 4 వందల 50 మందికి కుటుంబసభ్యులలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలు జరుగుతున్నాయని వివరించారు.

Latest News