Site icon vidhaatha

Warangal: రామప్పలో.. కన్నుల పండువగా ప్రపంచ వారసత్వ దినోత్సవాలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా శిల్పం, వర్ణం, కృష్ణం ” సెల‌బ్రేటింగ్ ది హెరిటేజ్ రామప్ప’ పేరుతో ‘వరల్డ్ హెరిటేజ్ డే’ మెగా వేడుకలు మంగళవారం రాత్రి కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కళా సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యుత్ దీపాల వెలుగులో రామప్ప దేవాలయం వెలిగిపోయింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ హాజ‌ర‌య్యారు.

వేడుకల్లో ప్రముఖ కళాకారుల ప్రదర్శనలు

రామప్ప దేవాలయం ప్రాంగణం లో ఫుడ్ ఫెస్టివల్, ప్రముఖ సంగీత దర్శకులు SS తమన్, డ్రమ్స్ వాయిద్య కారుడు శివమణి, సింగర్ కార్తీక్, నవీన్ లతో పాటు 300 మంది కళాకారులు కలిసి నాట్య ప్రదర్శ ఇచ్చారు. వయోలిన్ షో, లేజర్ షో లను నిర్వహించారు. షోలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

తెలంగాణ చరిత్ర గొప్పది

తెలంగాణ చరిత్ర చాలా గొప్పదని రాష్ట్ర సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హెరిటేజ్ ఉత్సవాలలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన పురావస్తు, చారిత్రక సంపద, ప్రకృతి జలపాతాలు, అందమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను, రాష్ట్ర హెరిటేజ్ శాఖ ఆధ్వర్యంలో పరిరక్షిస్తున్నామన్నారు. ఆ కృషి వల్ల రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించిందన్నారు.

రాష్ట్రంలో గుర్తింపు పొందే చారిత్రక వారసత్వ పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయని మంత్రి అన్నారు. కాకతీయుల కాలం నాటి చెరువులను రిజర్వాయ‌ర్లుగా మార్చి వ్యవసాయానికి ప్రభుత్వం వినియోగిస్తుందని చెప్పారు.

Exit mobile version