Site icon vidhaatha

విడిపోలేదు.. కలిసే జీవిస్తున్నాం: శృతిహసన్‌

విశ్వనటుడు కమలహాసన్ గారాల పట్టి అయిన శృతిహాసన్ వాస్తవానికి ఒక నాలుగు ఐదు త‌రాల త‌ర్వాత పుట్టి ఉండాల్సింది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌, న‌డ‌వ‌డిక అలా ఉంటాయి. విదేశీయులు కూడా ఆమె ముందు స‌రిరార‌ని చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే ఆమె తన ఎఫైర్స్ విషయంలో అంత ఫాస్ట్‌గా ఉంటుంది. ఏ విషయాన్ని దాచుకోదు. అవును కలిసి ఉన్నాం.. కలిసి జీవిస్తున్నాం.. స‌హ‌జీవనం చేస్తున్నాం. అయితే ఏంటి? అని ప్రశ్నిస్తుంది. ఇంకా ఈమె ఆ మధ్య లండన్‌కు చెందిన తన మ్యూజికల్ బ్రాండ్‌లో పనిచేసిన మైకేల్ కోర్స్‌లేతో స‌హ‌జీవ‌నం చేసింది.

ఆ తర్వాత ఆయనతో విడిపోయింది. ప్రస్తుతం ఆమె శాంతను హజారికా అనే మరో కళాకారుడితో సహజీవనం చేస్తోంది. వీరిద్ద‌రు ఈమధ్య విడిపోయారని వార్తలు వచ్చాయి. దానికి శృతిహాసన్ చేసిన ట్వీటే కారణం. ఆమె అందులో మాట్లాడుతూ ఒంటరితనంలో ఆనందం ఉంది. నా గురించి నేను తెలుసు కోవడానికి ఒంటరితనం ఎంతో ఉపయోగ పడుతుంది. ఒంటరితనం అనేది మనలోని వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకొని వస్తుందని ఏవేవో చెప్పింది. దాంతో అందరూ శాంతాను హజారికాతో శృతిహాసన్ బ్రేకప్ చెప్పిందని అనుకున్నారు. కానీ తాజాగా శృతిహాసన్ అలాంటిదేమీ లేదని తేల్చేసింది.

విషయానికొస్తే శృతిహాసన్ లివింగ్ రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసింది. రెండేళ్లకు పైగా ఆమె శాంతాను హ‌జారికాతో కలిసి జీవిస్తున్నారు. ఈ చెన్నై చిన్నది అతని కోసం ముంబైకి మ‌కాం మార్చింది. సౌత్ సినిమాల్లో నటిస్తూ.. ఆమె హైదరాబాద్ టు ముంబై ట్రావెల్ చేస్తూ గడుపుతోంది. ఇదంతా బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఇందులో ఎలాంటి దాపరికం లేదు.

తాజాగా తన ప్రియుడి గురించి, అతని గుణగణాలు, మంచి త‌నం గురించి శృతి తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె.. శాంతాను హజారికా నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరము ఎప్పుడూ కలిసే ఉంటాం. కలిసి జీవిస్తున్నాము. మా గురించి వచ్చే సోషల్ మీడియా కామెంట్స్ ఇద్దరం కలిసి చదువుతాము. అవి బలే ఫన్నీగా అనిపిస్తాయి. ఆ కామెంట్స్ చదివితే నాకు ఎంటర్టైన్మెంట్ ఫీలింగ్ కలుగుతుంది. శాంతాను మంచి వ్యక్తి. ఆయన వలన నాలో కొన్ని మార్పులు వచ్చాయి. నేను చాలా ప్రశాంతంగా మారిపోయాను. నాలో దయాగుణం పెరిగిపోయింది.

శాంతాను కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఇతరుల పట్ల దయ కలిగి ఉంటాడు. అతనిలోని ఆ రెండు లక్షణాలు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే వాటిని నేను కూడా అలవాటు చేసుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను సంతోషంగా ఉంచగలిగిన ఏకైక వ్యక్తి ఆయనే. అతని సాన్నిహిత్యాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. అతను పక్కనుంటే ప్రశాంతత ఫీల్ అవుతున్నాను. శాంతానుకు గుడ్ బై చెప్పేశాను అనే వార్తలు వచ్చాయి. ఒంటరితనమే బాగుంది అదే శాశ్వతం అంటూ పోస్ట్ చేస్తే దాని అర్థం అందరూ బ్రేకప్ అని భావించారు. శాంతాను నేను విడిపోలేదు.. అని స్పష్టత ఇచ్చింది.

ఈమధ్య తన ఎఫైర్స్‌‌లో పడి ఆమె తన కెరీర్‌పై సరిగా దృష్టి పెట్టకపోవడంతో గ్యాప్ వచ్చింది. ప్ర‌స్తుతం మ‌ర‌లా ట్రాక్‌లో పడింది. ఆమె తెలుగులో ఏకంగా ఒకేసారి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య చిత్రాలలో నటిస్తోంది.

ఈ చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నాయి. అలాగే ఆమె ప్రభాస్, ప్రశాంత్ నీల్‌ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ మూవీ కూడా వచ్చే ఏడాదే విడుదల కానుంది. మొత్తానికి కొత్త ఏడాది శృతికి తీపి గుర్తుగా మిగిలిపోతుందని మాత్రం చెప్పవచ్చు.

Exit mobile version