తీరు మారకపోతే.. జరిగే పరిణామాలకు మాది బాధ్యత కాదు: బాల్క సుమన్‌

విధాత: వైఎస్‌ కుటుంబమంతా తెలంగాణకు వ్యతిరేకమే అని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇవ్వొదని జగన్‌ పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించారు. షర్మిల తీరు మారకపోతే జరిగే పరిణామాలకు మాది బాధ్యత కాదని హెచ్చరించారు. జగన్‌ జైలుకెళ్లొచ్చిన దొంగ అని మేం అంటే ఏపీలో ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. వైఎస్‌ విషపు నవ్వులు తెలంగాణ సమాజం మరిచి పోలేదన్నారు. తెలంగాణలో విష […]

  • Publish Date - November 30, 2022 / 12:06 PM IST

విధాత: వైఎస్‌ కుటుంబమంతా తెలంగాణకు వ్యతిరేకమే అని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇవ్వొదని జగన్‌ పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించారు.

షర్మిల తీరు మారకపోతే జరిగే పరిణామాలకు మాది బాధ్యత కాదని హెచ్చరించారు. జగన్‌ జైలుకెళ్లొచ్చిన దొంగ అని మేం అంటే ఏపీలో ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. వైఎస్‌ విషపు నవ్వులు తెలంగాణ సమాజం మరిచి పోలేదన్నారు.

తెలంగాణలో విష బీజాలు నాటేందుకే షర్మిల యాత్రలు చేస్తున్నారని గొంగిడి సునీత విమర్శించారు. వైఎస్‌ షర్మిల మాట, ప్రవర్తన తీరు ఆడపిల్లలా లేదన్నారు. ఆమె ఓదార్పు యాత్రలు ప్రస్తుతం ఏపీలో అవసరమని తెలిపారు.

ఏపీలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మా నేతలు ఉద్యమంలో జైలుకు వెళ్లారు.. జగన్‌ వలె దోపిడీ కేసుల్లో కాదని మండిపడ్డారు. ఇప్పటివరకు జరిగింది వేరు.. ఇకపై జరగబోయేది వేరు అన్నారు.