నల్లగొండ జిల్లాలో 7 సీట్లు తప్పక గెలుస్తాం: దుబ్బాక ఎమ్మెల్యే

'ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర'లో ర‌ఘునంద‌న్‌రావు విధాత: తప్పు చేస్తే సీఎం కేసీఆర్ ఐనా, కేటీఆర్, కవిత ఎవరైనా సరే జైలుకెల్లాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 'ప్రజాగోస బీజేపీ భరోసాయాత్ర'లో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీని తిట్టిపోసే, మమతా బెనర్జీ, సిద్ధరామయ్య, పినరాయి విజయన్ మీద సీబీఐ, ఈడి కేసులు ఎందుకు లేవని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు […]

  • Publish Date - December 15, 2022 / 08:55 AM IST
  • ‘ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర’లో ర‌ఘునంద‌న్‌రావు

విధాత: తప్పు చేస్తే సీఎం కేసీఆర్ ఐనా, కేటీఆర్, కవిత ఎవరైనా సరే జైలుకెల్లాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘ప్రజాగోస బీజేపీ భరోసాయాత్ర’లో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీని తిట్టిపోసే, మమతా బెనర్జీ, సిద్ధరామయ్య, పినరాయి విజయన్ మీద సీబీఐ, ఈడి కేసులు ఎందుకు లేవని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు స్కాంలలో ఉన్నందునే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న కవిత జాగృతి పేరుతో హంగామా చేస్తుందని, ఎంత చేసినా సొంత పార్టీ నుండే కవితకు మద్దతు లభించడం లేదన్నారు.

బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి నా ప్రమేయం ఉంటే సిట్ నోటీసు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా కట్టుకథగా, అధికార బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన 6వేల రాజకీయ పార్టీల్లో.. బీఆర్ఎస్ ఒకటని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రతిపక్షాల నాయకులు ఎవరు కూడా కేసీఆర్‌ను నమ్మడం లేదన్నారు.

మునుగోడులో ఓటమిపై అంతర్గత చర్చ జరిగిందని, భవిష్యత్తు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాకు దిశానిర్దేశం ఉందన్నారు. హైదరాబాద్‌లో పోటీ చేయని టీఆర్ఎస్ ఢిల్లీలో టీఆర్ఎస్ అంటోందని విమర్శించారు. బండి సంజయ్ ముగింపు సంగ్రామ యాత్రలో నా ఫొటో, ఈటల ఫొటో లేకున్నా మా ప్రోటో కాల్ మాకు ఉందన్నారు. ఎంపీ కోమటిరెడ్డి బీజేపీలోకి వస్తారనే విషయంపై నాకు సమాచారం లేదని, ఏదైనా ఉంటే బీజేపీ కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

రాబోయే సాధారణ ఎన్నికల్లో.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయమని.. నల్లగొండ జిల్లా నుంచి 7 సీట్లు తప్పకుండా గెలుస్తామన్నారు. నల్గొండలో తెరాస ఎమ్మెల్యేని గెలిపిస్తే నల్గొండ పట్టణాన్ని దత్తతకు తీసుకుంటానని ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి ఇక్కడి ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు.

గత నాలుగు సంవత్సరాలుగా ఎక్కడా నయా పైసా అభివృద్ధి జరగలేదని, ఎలక్షన్లు సమీపిస్తున్నాయని మళ్లీ ఒకసారి తన మాయమాటలతో నియోజక వర్గ ప్రజలను మోసం చేయడానికి అవకాశం కోసం రోడ్లు వెడల్పు పేరుతో అనేక మంది వ్యాపారస్తులను రోడ్డున పడేసి అదే అభివృధి అని గొప్పలు చెప్పు కుంటున్నారని ఆరోపించారు.

గత ఎన్నికలలో పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీలను అమలు చేయలేదని, హుజూరాబాద్ ఎలక్షన్లో దళితులకు దళిత బందు ఇచ్చిండని, మరి నల్గొండ నియోజక వర్గంలో ఏ ఒక్కరికీ కూడా దళిత బంధు ఇవ్వలేదెందు కో ఇక్కడి ప్రజలు ఆలోచించాలన్నారు. పట్టణాలలో, గ్రామాల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అభివృధి జరుగుతుందని, రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ పాలనలో నిధులు లేక ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు దిక్కులేకుండా పోయిందన్నారు.

కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూధన్ రెడ్డి, యాత్ర ప్రముఖ్ వీరెల్లి చంద్ర శేఖర్, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, గార్లపాటి జితేందర్ కుమార్, పోతేపాక సాంబయ్య, దాయం భూపాల్ రెడ్డి, చింత ముత్యాల రావు, జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్, అయిత రాజు సిద్దు, పచ్చవ వంశీ కృష్ణ, పట్టణ అధ్యక్షులు మోరిశేట్టి నాగేశ్వర్ రావు, బొబ్బల్లి శ్రీనివాస్ రెడ్డి, పులకరం బిక్షం, గుండా వినయ్ , రావెళ్ల కాశమ్మ, వంగూరి రాఖీ ఆవుల మధు, చర్లపల్లి గణేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.