Peddapalli: జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటాం: TUWJ జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్

 నిరంజన్ కుటుంబానికి రూ. 68 వేల ఆర్థిక సహాయం విధాత, కరీంనగర్ బ్యూరో: జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని టియుడబ్ల్యూజే (ఐజెయూ)పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్ తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన యూనియన్ సభ్యుడు, పెద్దపల్లి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు జనగామ నిరంజన్ కుటుంబ సభ్యులకు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో 68 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈనెల 12న […]

  • Publish Date - March 29, 2023 / 03:38 PM IST

  • నిరంజన్ కుటుంబానికి రూ. 68 వేల ఆర్థిక సహాయం

విధాత, కరీంనగర్ బ్యూరో: జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని టియుడబ్ల్యూజే (ఐజెయూ)పెద్దపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్ తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన యూనియన్ సభ్యుడు, పెద్దపల్లి పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు జనగామ నిరంజన్ కుటుంబ సభ్యులకు బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో 68 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈనెల 12న నిరంజన్ అనారోగ్యంతో మృతి చెందడం విచారకరమన్నారు. ఆయన కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో ఆదుకోవాలని నిర్ణయించామన్నారు. సంఘ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం అందించాలని కోరగా, దాదాపు 150 మంది సభ్యులు స్పందించి సహాయాన్ని అందించారని తెలిపారు. మొత్తం రూ 68 వేలు జమకాగా నిరంజన్ కుమార్తె ఆశ్రిత పేరిట పోస్ట్ ఆఫీస్ లో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో రూ. 60 వేలు డిపాజిట్ చేశామని, మిగతా రూ. 8 వేలు వారి కుటుంబ అవసరాల కోసం నగదు అందజేశామన్నారు.

యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. సంఘ సభ్యుల సంక్షేమం కోసం యూనియన్ ఎప్పుడు పాటు పడుతుందని, గత ఏడాది సంఘ సభ్యులకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించిందని గుర్తు చేశారు.

కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నారాయణదాసు అశోక్, దాడుల వ్యతిరేక కమిటీ కో కన్వీనర్ చింతకింది చంద్రమొగిలి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరెల్లి మల్లేష్, ఎండి గౌస్ పాషా, టియుడబ్ల్యూజే (ఐజెయూ) మండల, పట్టణ శాఖ అధ్యక్షులు వీరమల్ల విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి ఆకుల రమేష్, బెజ్జంకి నరేష్, చేగొండ రవికుమార్, జిలకర రమేష్, బిర్రు రంజిత్ కుమార్, మొలుగూరి కమల్, ఎండి సాబీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Latest News