Peddapalli Check Dams| పెద్దపల్లి చెక్ డ్యాంల ఘటనపై విజిలెన్స్ విచారణకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంల ధ్వంసం ఘటనపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చారు.

విధాత, హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంల(Check Dams damage)ధ్వంసం ఘటనపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)విజిలెన్స్ విచారణ(vigilance inquiry)కు ఆదేశాలు ఇచ్చారు.
నాసిరక నిర్మాణం లేదా నాణ్యత లోపం అని తేలితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కావాలనే ధ్వంసం చేసినట్లు తేలితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విచారణను వేగవంతం చేసి బాధ్యులను గుర్తించాలని విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు.

రైతులకు మేలు చేసే చెక్ డ్యాంలను ధ్వంసం చేయాలనుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా చెక్ డ్యాంల భద్రతపై నిఘా పెట్టాలని ఆదేశించారు.  ప్రభుత్వంలోని వారు ఇసుక దోపిడీ కోసం చెక్ డ్యాంలను పేల్చేస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపించిన నేపథ్యంలో మంత్రి ఉత్తమ్  విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.

Latest News