WhatsApp | వాట్సాప్‌ యూజర్లకు మరో గుడ్‌న్యూస్‌..! ఇకపై ఒక మొబైల్‌లో ఒకటికి మించి అకౌంట్స్‌ వాడుకునేలా సరికొత్త ఫీచర్‌..!

WhatsApp | ప్రముఖ మెస్సేజింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. తాజాగా మరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఒక మొబైల్‌లో ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను వాడుకునేందుకు అవకాశం ఉండగా.. త్వరలో ఒకటికి మించి అకౌంట్స్‌ వాడుకునే అవకాశాన్ని కల్పించనున్నది. జీమెయిల్‌ తరహాలోనే.. ప్రస్తుతం గూగుల్‌ జీమెయిల్‌ చాలా మందే వాడుతుంటారు. ఇందులో ఒకటికి మించి అకౌంట్స్‌ను వాడుకుంటారు. అయితే, వాట్సాప్‌లో మల్టీ అకౌంట్స్‌ను వాడుకునేందుకు వీలు […]

  • Publish Date - August 13, 2023 / 03:43 AM IST

WhatsApp |

ప్రముఖ మెస్సేజింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. తాజాగా మరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది. ప్రస్తుతం ఇప్పటి వరకు ఒక మొబైల్‌లో ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను వాడుకునేందుకు అవకాశం ఉండగా.. త్వరలో ఒకటికి మించి అకౌంట్స్‌ వాడుకునే అవకాశాన్ని కల్పించనున్నది.

జీమెయిల్‌ తరహాలోనే..

ప్రస్తుతం గూగుల్‌ జీమెయిల్‌ చాలా మందే వాడుతుంటారు. ఇందులో ఒకటికి మించి అకౌంట్స్‌ను వాడుకుంటారు. అయితే, వాట్సాప్‌లో మల్టీ అకౌంట్స్‌ను వాడుకునేందుకు వీలు లేదు. మరో అకౌంట్‌ను వాడుకునేందుకు తప్పనిసరిగా మరో ఫోన్‌ను వినియోగించాల్సి వస్తుంది. ఇకపై మరో ఫోన్‌ను వినియోగించే అవసరం లేకుండా వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేయబోతున్నది.

ఇందులో ఒకటికి మించి వాట్సాప్‌ అకౌంట్లను వాడుకునే వీలు కలుగనున్నది. ప్రస్తుతం వాట్సాప్‌ దీనిపై పని చేస్తున్నది. అప్‌డేట్‌ను కొందరు ఎంపిక చేసిన బీటా యూజర్లకు మాత్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. టెస్టింగ్‌ పూర్తయ్యాక అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

ఎలా ఆపరేట్‌ చేయాలంటే..

ప్రస్తుతం ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉన్నది. అందుబాటులోకి వచ్చాక మల్టీ అకౌంట్‌ సదుపాయాన్ని ఫోన్‌లో యాడ్‌ చేసుకోవడం చాలా తేలిక. ఇందుకు మీరు చేయాల్సింది.. మీ ఫోన్‌లోని వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత అక్కడ కనిపించే క్యూ ఆర్‌ కోడ్‌ (QR code) బటన్ పక్కన ఉన్న బాణం గుర్తుపై క్లిక్ చేయాలి. అక్కడ మీ వేరే వాట్సాప్ అకౌంట్‌ను యాడ్‌ చేసుకోవాలి. అనంతరం ఈ రెండు వాట్సాప్‌ అకౌంట్స్‌ను ఒకే యాప్‌లో వాడుకునే వీలుంటుంది. అవసరం లేదనుకుంటే ఆ అకౌంట్‌ను లాగ్‌ అవుట్‌ చేస్తే సరిపోతుంది. లేకపోతే డిలీట్‌ అయినా చేసుకోవచ్చు.

అయితే, ఈ ఫీచర్‌ యూజర్లకు ఎంతోగానో ఉపయోగకరంగా ఉంటుందని వాట్సాప్‌ పేర్కొంటుంది. దీంతో వేర్వేరు అవసరాలకు వాట్సాప్‌ అకౌంట్లను వాడే వారికి ప్రత్యేకంగా ఫోన్‌ వెంట ఉంచుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకే ఫోన్‌లో ఒకే యాప్‌లో ఒకటికి మించిన వాట్సాప్ ఖాతాలను వాడుకునే అవకాశం లభించనున్నది. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉండగా.. విజయవంతం అయ్యాక కంపెనీ యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.

Latest News