ప్రస్తుతం ప్రపంచ కప్‌కు సన్నాహకంగా పాకిస్తాన్ ప్రాక్టీస్ సెషన్‌లో నిశాంత్ పాల్గొంటున్నాడు. హైదరాబాద్‌లో శిక్షణ కోసం సిద్ధమవుతున్న పాక్ జట్టుకు అందుబాటులో ఉన్న నెట్ బౌలర్లలో ఒకడు. బౌన్స్‌తో పాక్ క్రికెటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. హై-ప్రొఫైల్ రాకపోయినా సమయాన్ని వృథా చేయకుండా విదేశీ ఆటగాళ్లతో నెట్ సెషన్లలో ఆడుతున్నాడు. సాధారణంగా గంటకు 140-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఈ హైదరాబాద్ యువ పేసర్.. తన పేస్‌ను గణనీయంగా పెంచుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు.
ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న పేసర్లందరితో ఈ సలహాలను పంచుకుంటున్నాడు. తన ఎత్తు కారణంగా నిశాంత్ అదనపు బౌన్సులు వేయడంలో పేరుగాంచాడు. అంతర్జాతీయ బ్యాటర్లకు బౌలింగ్ చేసిన అనుభవం నిశాంత్‌కు ఉండటం గమనార్హం. హైదరాబాద్‌లో జరిగిన ఇండియా-న్యూజిలాండ్ వన్‌డే మ్యాచ్‌కు ముందు నిశాంత్ నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌తో ఉన్న చిత్రాన్ని కూడా పోస్ట్ చేశాడు.
దాదాపు రెండు వారాలపాటు పాకిస్థాన్ జట్టు హైదరాబాద్‌లో ఉండనుండటంతో నిశాంత్‌కు తన ప్రతిభను ప్రదర్శించేందుకు అనేక అవకాశాలు లభించనున్నాయి. క్రికెట్‌లో మంచి కెరీర్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇండియా జట్టుకు ఎంపిక కావడం తన లక్ష్యమని చెప్పాడు నిశాంత్.