IST: ఇక దేశం మొత్తం ఒకే టైం!

ఇండియ‌న్ స్టాండ‌ర్డ్ టైమ్.. అనుస‌రించేలా కేంద్రం చ‌ర్య‌లు! అన్ని రంగాల్లో ఒకే ప్రామాణిక కాలం అమ‌లు సువిశాల భార‌త్‌లో ఐఎస్‌టీ అనుస‌రించ‌టం సాధ్య‌మేనా? విధాత‌: దేశంలో ప్ర‌తి ఒక్క‌రూ ఇక నుంచి భార‌త ప్రామాణిక స‌మయాన్ని అనుస‌రించేలా చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ స్థాయిలో క‌స‌రత్తు కూడా చేస్తున్న‌ట్లు అధికారులు దృవీక‌రిస్తున్నారు. ఇక నుంచి దేశంలోని అన్ని నెట్ వ‌ర్క్‌లు, కంప్యూట‌ర్లు, స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ఇండియ‌న్ స్టాండ‌ర్డ్ టైమ్ (ఐఎస్‌టీ)తో […]

  • Publish Date - January 6, 2023 / 09:20 AM IST
  • ఇండియ‌న్ స్టాండ‌ర్డ్ టైమ్.. అనుస‌రించేలా కేంద్రం చ‌ర్య‌లు!
  • అన్ని రంగాల్లో ఒకే ప్రామాణిక కాలం అమ‌లు
  • సువిశాల భార‌త్‌లో ఐఎస్‌టీ అనుస‌రించ‌టం సాధ్య‌మేనా?

విధాత‌: దేశంలో ప్ర‌తి ఒక్క‌రూ ఇక నుంచి భార‌త ప్రామాణిక స‌మయాన్ని అనుస‌రించేలా చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచిస్తున్న‌ట్లు తెలిసింది. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ స్థాయిలో క‌స‌రత్తు కూడా చేస్తున్న‌ట్లు అధికారులు దృవీక‌రిస్తున్నారు.

ఇక నుంచి దేశంలోని అన్ని నెట్ వ‌ర్క్‌లు, కంప్యూట‌ర్లు, స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ఇండియ‌న్ స్టాండ‌ర్డ్ టైమ్ (ఐఎస్‌టీ)తో అనుసంధానం చేస్తారు. అలాగే.. ఇంట‌ర్నెట్ ప్రొవైడ‌ర్లు, ప‌వ‌ర్ గ్రిడ్లు, బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు వంటి వ‌న్నీ ఐఎస్‌టీతో అనుసంధానం చేయ‌బ‌డుతాయి. ఐఎస్‌టీని అనుస‌రించే ఇవ‌న్నీ త‌మ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హించాల్సి ఉంటుంది.

అయితే సువిశాల దేశంలో దేశం మొత్తానికి ఒక ప్రామాణిక‌ కాలాన్ని అమలు చేయాలంటే.. అనేక ఆచ‌ర ణాత్మ‌క ఇబ్బందులు త‌లెత్తే అవ‌కాశం ఉన్న‌ది. క‌శ్మీర్‌లో, క‌న్యాకుమారిలో ఒకే టైముకు బ్యాంకులు తీసి సేవ‌లు అందించి ఒకే స‌మయానికి మూసేయాలంటే అనేక ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశ‌మున్న‌ది.

తూర్పు, ప‌డ‌మ‌ర‌లు, ఉత్త‌ర‌, ద‌క్షిణాల మ‌ధ్య ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల దూరం ఉన్న భౌగోళిక ప‌రిస్థితిలో సూర్యో ద‌యం, సూర్యాస్త‌మ‌య స‌మ‌యాల్లో చాలా వ్యత్యాసం ఉంటున్న‌ది. అలాంట‌ప్పుడు టెలికం స‌ర్వీసులు, బ్యాంకులు, ఇత‌ర సాంకేతిక నెట్ వ‌ర్క్‌లు, సేవారంగాల‌న్నీ దేశ వ్యాప్తంగా ఒకే స‌మయం పాటించ‌టం ఆచ‌ర‌ణ సాధ్య‌మేనా.. అన్న‌ది ఆలోచించాల్సిన అవ‌స‌ర‌మున్న‌ది.