World’s Ugliest Dog | ప్ర‌పంచంలో.. అత్యంత అస‌హ్య‌క‌ర‌మైన శున‌కం ఇదే

World's Ugliest Dog | ముగిసిన ప్ర‌పంచ అస‌హ్య‌క‌ర‌మైన శున‌కం అవార్డు పోటీలు విధాత‌: ప్ర‌పంచ అసహ్య‌క‌ర‌మైన శున‌కం (World's Ugliest Dog) - 2023 అవార్డును స్కూట‌ర్ అనే ఏడేళ్ల కుక్క ద‌క్కించుకుంది. మొత్తం ప్ర‌పంచ‌వ్యాప్తంగా తుది జాబితాలో వ‌చ్చిన ఏడు ఇత‌ర కుక్క‌ల‌తో పోటీ ప‌డి ఈ అవార్డును సాధించింది. ప్ర‌ఖ్యాతి చెందిన ఈ అవార్డు కార్య‌క్ర‌మం కాలిఫోర్నియాలో ఆదివారం జ‌రిగింది. ఈ అవార్డు కింద స్కూట‌ర్‌కు 1500 డాల‌ర్లు, ట్రోఫీ ల‌భించాయి. కాళ్ల […]

  • Publish Date - June 26, 2023 / 12:24 PM IST

World’s Ugliest Dog |

ముగిసిన ప్ర‌పంచ అస‌హ్య‌క‌ర‌మైన శున‌కం అవార్డు పోటీలు

విధాత‌: ప్ర‌పంచ అసహ్య‌క‌ర‌మైన శున‌కం (World’s Ugliest Dog) – 2023 అవార్డును స్కూట‌ర్ అనే ఏడేళ్ల కుక్క ద‌క్కించుకుంది. మొత్తం ప్ర‌పంచ‌వ్యాప్తంగా తుది జాబితాలో వ‌చ్చిన ఏడు ఇత‌ర కుక్క‌ల‌తో పోటీ ప‌డి ఈ అవార్డును సాధించింది. ప్ర‌ఖ్యాతి చెందిన ఈ అవార్డు కార్య‌క్ర‌మం కాలిఫోర్నియాలో ఆదివారం జ‌రిగింది. ఈ అవార్డు కింద స్కూట‌ర్‌కు 1500 డాల‌ర్లు, ట్రోఫీ ల‌భించాయి.

కాళ్ల అవిటిత‌నంతో జ‌న్మించిన స్కూట‌ర్‌ను సేవింగ్ యానిమ‌ల్ ఫ్రం యుథ‌నేసియా (సేఫ్‌) స‌భ్యులు సంర‌క్షించారు. ఆ త‌ర్వాత మొన్న‌మొన్న‌టి వ‌ర‌కు దీనిని ఒక వ్యక్తి పెంచుకోగా… ప్ర‌స్తుతం చూసుకోలేక‌పోవ‌డంతో లిండా అనే మ‌హిళ‌కు ద‌త్త‌త ఇచ్చేశాడు. ప్ర‌స్తుతం స్కూట‌ర్ వ‌య‌సు పెర‌గ‌డంతో చ‌లాకీగా ఉండ‌లేక‌పోతోంద‌ని కొత్త య‌జ‌మాని లిండా తెలిపింది.

ప్ర‌స్తుతం దానికి కాళ్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఒక బండిని ఏర్పాటు చేశామ‌ని.. దీంతో అది మ‌రింత మెరుగ్గా, వేగంగా క‌దులుతోంద‌ని వెల్ల‌డించింది. దానికున్న అవిటిత‌నాన్ని ప‌క్క‌న పెడితే.. స్కూట‌ర్ కూడా మిగ‌తా శున‌కాల్లేగా విశ్వాసాన్ని, ప్రేమ‌ను చూపిస్తోంద‌ని తెలిపింది.

కొవిడ్ త‌ర్వాత తొలిసారి జ‌రిగిన 2022 ఎడిష‌న్‌ను మిస్ట‌ర్ హ్యాపీ ఫేస్ అనే శున‌కం ద‌క్కించుకుంది. ‘అస‌హ్య‌క‌ర‌మైన కుక్క పోటీల‌ను న‌వ్వుకోవ‌డానికో, హేళ‌న చేయ‌డానికో నిర్వ‌హించ‌డం లేదు. వాటికున్న ప్ర‌త్యేక‌మైన ల‌క్ష‌ణాల‌ను మ‌నం ఆనందించ‌డానికి.. వాటి అందాన్ని అంద‌రికీ ప‌రిచ‌యం చేయ‌డ‌మే ఈ పోటీల ఉద్దేశం’ అని ఈ పోటీల అధికారిక వెబ్‌సైట్‌లో రాసి ఉంది. ఆ కుక్క అందాల‌ను మీరూ చూసేయండి.