Balagam | KTR స్పీచ్‌తో.. ‘బలగం’ సినిమాను మళ్లీ ఎగబడి చూస్తున్నారట

Balagam | ఇటీవల మానవ సంబంధాల గురించి అత్యద్భుతంగా రూపొందించబడిన ‘బలగం’ సినిమా అందరినీ ఆకర్షించింది. అంతర్జాతీయంగా కూడా ఎన్నో అవార్డులను సంపాదించిన ఈ సినిమాకి మొట్టమొదటిసారి వేణు ఎల్దండి(కమెడియన్ వేణు) దర్శకత్వం వహించారు. దిల్ రాజు బ్యానర్‌లో హర్షితా రెడ్డి నిర్మాణంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ నటీనటులుగా నటించిన ఈ సినిమా తెలంగాణ సంస్కృతులను చూపిస్తూ, మానవ అనుబంధాలను స్క్రీన్ పైన ఆవిష్కరించిన తీరు అందరినీ కట్టిపడేసింది. ఈ నేపథ్యంలో తాజాగా వర్షాకాలం సమావేశాల […]

  • Publish Date - August 12, 2023 / 05:34 PM IST

Balagam |

ఇటీవల మానవ సంబంధాల గురించి అత్యద్భుతంగా రూపొందించబడిన ‘బలగం’ సినిమా అందరినీ ఆకర్షించింది. అంతర్జాతీయంగా కూడా ఎన్నో అవార్డులను సంపాదించిన ఈ సినిమాకి మొట్టమొదటిసారి వేణు ఎల్దండి(కమెడియన్ వేణు) దర్శకత్వం వహించారు.

దిల్ రాజు బ్యానర్‌లో హర్షితా రెడ్డి నిర్మాణంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ నటీనటులుగా నటించిన ఈ సినిమా తెలంగాణ సంస్కృతులను చూపిస్తూ, మానవ అనుబంధాలను స్క్రీన్ పైన ఆవిష్కరించిన తీరు అందరినీ కట్టిపడేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా వర్షాకాలం సమావేశాల గురించి అసెంబ్లీ‌లో తెలంగాణ మంత్రి కే.టీ.ఆర్. ఈ సినిమా గురించి మాట్లాడారు. మానవ సంబంధాల మీద ఈ మధ్య వచ్చిన సినిమాల్లో తరతరాలుగా గుర్తుండిపోయే విధంగా తీసిన ఈ సినిమా దర్శకుడు రాజన్న సిరిసిల్ల నుండే వచ్చాడు. ఈ మధ్యే జిల్లాగా మారిన రాజన్న సిరిసిల్లకి ఎమ్మెల్యే అయిన కే.టీ.ఆర్. అసెంబ్లీలో ఈ సినిమాని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు.

‘ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ పాలనలో సినిమావాళ్లు కరువులని, కటిక దారిద్య్రాన్ని చిత్రీకరించేందు కు తెలంగాణకి వచ్చేవాళ్లు. ఇప్పుడు కే.సి.ఆర్. పాలనలో పచ్చదనంతో, పాడి పంటలతో పరవశించిపోయే పల్లె అందాలని చూపెట్టాలంటే తెలంగాణ ఊళ్ళని వెతుక్కుంటూ వస్తున్నారు.

మా తెలంగాణ బిడ్డ ఎల్దండి వేణు ఈ బలగం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మీ సపోర్ట్ కావాలి అని అడిగితే.. నేను సిరిసిల్లలోనే జరపండి అని చెప్పి, వెళ్లి ఆ సినిమా ఈవెంట్‌ని దగ్గరుండి జరిపించాను. కుటుంబ సభ్యులతో ఆ సినిమాని చూసినప్పుడు ఆ సన్నివేశాలు అన్నీ తెలంగాణాలోనే తీశారా, ఆ కనిపించే ఊళ్ళను చూసి ఇది కోనరావుపేటా లేక కోనసీమా అని అడిగారు.

తెలంగాణలో కరువు సీమలు అన్నీ కోనసీమలా అభివృద్ధి చెందాయి’ అంటూ తెలంగాణలో జరిగిన, జరుగుతున్న మార్పుల గురించి కేటీఆర్ చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడైతే కేటీఆర్ నుంచి ఈ మాట వచ్చిందో.. మరోసారి ‘బలగం’ సినిమాకు వ్యూవర్‌షిప్ పెరుగుతోందట. కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత ‘బలగం’ సినిమా చూసేవారి సంఖ్య పెరిగిందని సదరు ఓటీటీ వారు చెబుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Latest News