Dead For Three Minutes | మూడు నిమిషాలు మ‌ర‌ణించి.. బ‌తికిన మ‌హిళ‌! తర్వాత జీవితంలో విచిత్రాలు

GADead For Three Minutes | న్యూ యార్క్: ఓ మ‌హిళ సుమారు 12 ఏళ్ల క్రితం త‌న జీవితంలో జ‌రిగిన అద్భుతాన్ని టిక్‌టాక్ (Tiktok)లో వెల్ల‌డించింది. జేడ్ అనే స‌ద‌రు మ‌హిళ చెప్పిన దాని ప్ర‌కారం తీవ్ర‌మైన గుండెపోటు (Heart Attack) తో త‌న గుండె ఆగిపోయి మూడు నిమిషాలు మ‌ర‌ణించాన‌ని.. అనంత‌రం వైద్యులు తీవ్ర కృషి చేయ‌డంతో ప్రాణం వెన‌క్కి వ‌చ్చింద‌ని తెలిపింది. ఆ మూడు నిమిషాల స‌మయంలో త‌న‌కు ఏం క‌నిపించిందో పూస […]

  • Publish Date - June 14, 2023 / 10:44 AM IST

GADead For Three Minutes |

న్యూ యార్క్: ఓ మ‌హిళ సుమారు 12 ఏళ్ల క్రితం త‌న జీవితంలో జ‌రిగిన అద్భుతాన్ని టిక్‌టాక్ (Tiktok)లో వెల్ల‌డించింది. జేడ్ అనే స‌ద‌రు మ‌హిళ చెప్పిన దాని ప్ర‌కారం తీవ్ర‌మైన గుండెపోటు (Heart Attack) తో త‌న గుండె ఆగిపోయి మూడు నిమిషాలు మ‌ర‌ణించాన‌ని.. అనంత‌రం వైద్యులు తీవ్ర కృషి చేయ‌డంతో ప్రాణం వెన‌క్కి వ‌చ్చింద‌ని తెలిపింది. ఆ మూడు నిమిషాల స‌మయంలో త‌న‌కు ఏం క‌నిపించిందో పూస గుచ్చిన‌ట్లు వివ‌రించింది.

‘ముందుగా నా క‌ళ్ల ముందు చిక్క‌టి చీక‌టి ఆవ‌రించింది. అంతా క్ష‌ణాల్లో గ‌డిచిపోయింది కానీ నాకు మాత్రం ఆ మూడు నిమిషాలు ఒక జీవిత కాలంలా అనిపించింది. అప్పుడు నా మీద కొన్ని ట‌న్నుల ఇటుక‌లు పెట్టిన‌ట్లు ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్ సోఫాలో ప‌డిపోడ‌మే గుర్తుంది. కొన్ని సార్లు నీటిలో మునిగిపోతున్న‌ట్లు అనిపించింది’ అని ప్ర‌స్తుతం 36 ఏళ్ల వ‌య‌సున్న జేడ్ గుర్తు చేసుకుంది. ఇక తాను చ‌నిపోతున్న‌ట్లు అర్థ‌మైంద‌ని తెలిపింది.

అప్పుడు త‌ను అలా ప‌డి పోవ‌డం చూసిన స్నేహితులు వెంట‌నే అంబులెన్స్‌ను పిలిచి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. జేడ్ అప్ప‌టికి మూడు నిమిషాల ముందే మ‌ర‌ణించింద‌ని ప్ర‌క‌టించిన వైద్యులు.. చివ‌రి ఆశ‌గా ఎల‌క్ట్రిక్ షాక్ (Shock Treatment) ఇవ్వ‌డంతో తిరిగి జేడ్ గుండె కొట్టుకోవ‌డం ప్రారంభించింది.