Site icon vidhaatha

Hanamkonda | రెజ్లర్లకు సంఘీభావంగా మహిళా, కార్మిక సంఘాల నిరసన.. బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అంతర్జాతీయ మహిళా రెజ్లర్ల మీద లైంగిక వేధింపులకు పాల్పడిన ఆ ఫెడరేషన్ అధ్యక్షులు బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా సీఐటీయు(CITU), ఏఐడీడౠ్యఏ (AIDWA) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ప్రజా సంఘాల జాతీయ కమిటీల పిలుపులో భాగంగా గురువారం హనుమకొండ (Hanamkonda) లో కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ వద్ద పెద్దఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం అరగంట పాటు రాస్తారోకో చేశారు.

20 రోజులుగా దేశ రాజధాని కేంద్రంలో మహిళా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నప్పటికీ అధికార బిజెపిలో కనీస చలనం లేదని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గురించి మాట్లాడే నాయకులు కనీసం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టి ఉప్పలయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి దీప, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వి వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version