Site icon vidhaatha

Kareemnagar: రేకుర్తి కంటి ఆసుపత్రికి వండర్ బుక్ అఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ అవార్డు

విధాత బ్యూరో, కరీంనగర్: అక్టోబర్ నెలలో ఒకే రోజు 124 కంటి ఆపరేషన్లు చేసినందుకుగాను లయన్స్ క్లబ్ అఫ్ కరీంనగర్ ఉదార కంటి ఆసుపత్రి వండర్ బుక్ అఫ్ ఇంటర్నేషనల్ రికార్డులకెక్కింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
గురువారం ఆసుపత్రి చైర్మన్ కొండ వేణు మూర్తి, వైస్ చైర్మన్ చిదుర సురేష్‌లకు అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ అంధ‌త్వ నివారణ కోసం ఆసుపత్రి చేస్తున్న సేవలను అభినందించారు. త్వరలోనే ఆసుపత్రిని సందర్శిస్తానని తెలియచేశారు. చైర్మన్ కొండ వేణు మూర్తి మాట్లాడుతూ ఆసుపత్రిలో లభిస్తున్న రెటినా, గ్లకొమా మరియు మెల్ల కన్ను సర్జరీ సేవలను వినియోగించుకోవాలన్నారు.

ఆసుప‌త్రి సాధించిన విజ‌యాలు

1988లో డాక్టర్ భాస్కర్ మడేకర్ స్థాపించిన ఈ ఆసుపత్రి గడచిన 35 ఏళ్ల కాలంలో వేల సంఖ్యలో వైద్య శిబిరాలు, శస్త్ర చికిత్సలు నిర్వహించింది.
గతంలోనే ఈ ఆసుపత్రి ఐఎస్ఓ 9001-2015 సర్టిఫికేషన్ సాధించింది.
ఇప్పటివరకు గ్రామీణ పేదలకోసం 7,27,892 కంటి వైద్య శిబిరాలు, 89,324 శస్త్ర చికిత్సలు
విజయవంతంగా నిర్వహించింది.
కంటి వైద్య రంగంలో వస్తున్న అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను ఆసుపత్రి అందిస్తోంది

కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి వి రామకృష్ణ రావు, పట్టణ శాఖ అధ్యక్షుడు చల్ల.హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version