Grain Crisis | ముంచుకొస్తున్న ధాన్య సంక్షోభం

Grain Crisis విధాత‌: చైనా కీల‌క ధాన్య ఉత్ప‌త్తి ప్ర‌దేశ‌మైన ఉత్త‌ర ప్రాంతంలో వ‌ర‌ద‌ల ప్ర‌భావంగా మొక్క జొన్న‌, వ‌రి పంట‌లు భారీగా న‌ష్టానికి గుర‌య్యాయి. మ‌రో సారి భారీ వర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని దీని వ‌ల్ల ప్ర‌పంచ ద్ర‌వ్యోల్బ‌ణంపై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశమున్న‌ట్లు వ‌ర్త‌కులు, విశ్లేష‌కులు అంటున్నారు. చైనా తృణ‌ధాన్యాలపై న‌ష్టం ఎంత మేర‌కు వాటిల్లింద‌నేది ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా వినియోగ‌దారులు ధాన్యం ప‌ట్ల గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురుకునే ప‌రిస్థితులు ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు […]

  • Publish Date - August 12, 2023 / 01:45 PM IST

Grain Crisis

విధాత‌: చైనా కీల‌క ధాన్య ఉత్ప‌త్తి ప్ర‌దేశ‌మైన ఉత్త‌ర ప్రాంతంలో వ‌ర‌ద‌ల ప్ర‌భావంగా మొక్క జొన్న‌, వ‌రి పంట‌లు భారీగా న‌ష్టానికి గుర‌య్యాయి. మ‌రో సారి భారీ వర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని దీని వ‌ల్ల ప్ర‌పంచ ద్ర‌వ్యోల్బ‌ణంపై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశమున్న‌ట్లు వ‌ర్త‌కులు, విశ్లేష‌కులు అంటున్నారు. చైనా తృణ‌ధాన్యాలపై న‌ష్టం ఎంత మేర‌కు వాటిల్లింద‌నేది ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా వినియోగ‌దారులు ధాన్యం ప‌ట్ల గ‌డ్డు ప‌రిస్థితులు ఎదురుకునే ప‌రిస్థితులు ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అంటున్నారు.

అలాగే ఇటీవ‌లే ధాన్యం ఎగుమ‌తుల‌పై భార‌త దేశం నిషేధం విధించ‌టం, ర‌ష్యా – ఉక్రెయిన్ యుద్ధం మూలంగా న‌ల్ల స‌ముద్రం ద్వారా ధాన్యాన్ని స‌ర‌ఫ‌రా చేయ‌డం క‌ష్ట‌త‌రంగా మార‌టం కూడా ఓ విధంగా ఈ క‌రువుకు కార‌కం అవుతుండవ‌చ్చున‌ని చైనాలో ధాన్యం వ్యాపారం చేస్తున్న సింగ‌పూర్‌కు చెందిన వ్యాపారి తెలిపారు. వ‌ర‌ద‌లు త‌గ్గాక చైనాలో ఎంత‌మేర‌కు పంట న‌ష్టం జ‌రిగింద‌ని ఓ అంచ‌నాకు వ‌స్తామ‌ని అన్నారు.రెండు వారాల క్రితం కురిసిన డొక్సూరి తుఫాను కార‌ణంగా ఇంకా ఉత్త‌ర చైనాలోని న‌దులు పొంగి పొర్లుతున్నాయి. ఇదే కాకుండా రాబోయే ఖానున్ తుఫాను మూలంగా ఎంత మేర‌కు పంట‌ న‌ష్టం జ‌రుగుతున్న‌దో చూడాలి.

ఈ నేప‌థ్యంలో చైనా ఉత్త‌ర‌ హేబీ ప్రావిన్స్‌లో అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను గురువారం అత్య‌ధిక స్థాయికి పెంచింది. ఈ మేర‌కు లోత‌ట్టు ప్రాంతాల్లో న‌ష్టాలు వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. అయితే నాలుగు నుంచి ఐదు మిలియ‌న్‌ మెట్రిక్ ట‌న్నుల మొక్క జొన్న పంట వ‌ర‌ద‌ల కార‌ణంగా న‌ష్ట‌పోయిన‌ట్లు రెండు వాణిజ్య వర్గాలు వెల్ల‌డించాయి. ఎంత మేర‌కు పంట న‌ష్టం జ‌రిగింద‌నేది మ‌నం ఇప్పుడే నిర్ధారించ‌లేమ‌ని మ‌రో సింగ‌పూర్ ట్రేడ‌ర్ పేర్కొన్నారు. డొక్సూరి తుఫాను ప్ర‌భావంగా ఈశాన్య ప్ర‌దేశాల్లోని లోత‌ట్టు ప్రాంతాల్లో మొక్క జొన్న పంట‌ను దెబ్బ‌తీశాయ‌ని దీంతో 2023-24 సంవ‌త్సారానికి మొక్క జొన్న పంట 282.34 మిలియ‌న్ మెట్రిక్ ట‌న్నుల‌కు చేరింద‌ని చైనా వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖ శుక్ర‌వారం వెల్ల‌డించింది.

వ‌ర‌ద‌ల వ‌ల్ల‌ వ‌రి పంట‌ల రాబ‌డి కూడా త‌గ్గింది. ఈశాన్య చైనా ప్రాంతంలో వ‌ర‌ద ప్ర‌భావితంగా మూడు నుంచి ఐదు శాతం మేర వ‌రి పంట ఉత్ప‌త్తి త‌గ్గిన‌ట్లు బీజింగ్ ఓరియంట్ అగ్రీ బిజినెస్ క‌న్స‌ల్టెంట్ సీనియ‌ర్ విశ్లేష‌కుడు మా వెన్‌ఫెగ్ తెలిపారు. చైనాలో కురుస్తున్న భారీ వ‌ర్షాల మూలంగా బియ్యం ధ‌ర‌లు ప్ర‌పంచవ్యాప్తంగా పెరిగాయి. భార‌త దేశం బియ్యం ఎగుమ‌తి పై నిషేధం విధించ‌డంతో ఇప్ప‌టికే ధ‌ర‌లు 20 శాతం పైకెక్కాయి.