Site icon vidhaatha

WTC | ఆస్ట్రేలియాదే.. డబ్ల్యూటీసీ ట్రోఫీ

విధాత‌: ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్ (WTC) ఫైనల్‌లో భారత్‌ నిరాశే ఎదురైంది. చివరి రోజు 280 పరుగులు చేయాల్సిన టీమిండియా అభిమానులు ఆశించినట్టు అద్భుతాలేమీ చేయకుండానే చేతులెత్తేసింది. ఫలితంగా 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ విజేతగా నిలిచింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 63.3 ఓవర్లలో 234 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో కోహ్లీ (49) రన్స్‌ చేసిన ఒక్క పరుగు దూరంలో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. రహానె (46), జడేజా (0), ఉమేశ్‌ యాదవ్‌ (1), షమీ (13 నాటౌట్‌) సిరాజ్‌ (1) శ్రీకర్‌ భారత్‌ (23) పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగుల చేయగా.. భారత్‌ తొలి ఇన్సింగ్స్‌లో 269 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 270 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

444 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన భారత్‌ నిన్న 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. అప్పటికి కోహ్లీ, రహానె క్రీజ్‌లో ఉన్నారు. దీంతో ఆఖరి రోజు 280 లక్ష్య ఛేదించడానికి బరిలోకి దిగింది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాభారత ఆటగాళ్లు అద్భుతం చేస్తారని అంతా భావించారు.

ఓవల్ అత్యధిక లక్ష్య ఛేదన 263 పరుగులే. ఈ రికార్డును 1902లో ఇంగ్లాండ్‌ నెలకొల్పింది. ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దీన్ని రోహిత్‌ సేన బద్దలు కొడుతుందని భావించారు. కానీ అభిమానుల ఆశలన్నీ ఆవిరైపోయాయి.

234 రన్స్‌ మాత్రమే చేసి చేతులెత్తిసింది. దీంతో ఆస్ట్రేలియా209 పరుగుల తేడాతో భారత్‌పై గెలుపొందింది. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ జగజ్జేతగా నిలిచింది. దీంతో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫి కలగానే మిగిలిపోయింది.

Exit mobile version