WWE | హైదరాబాద్‌లో తొలి సారి డబ్ల్యూడబ్ల్యూఈ.. సెప్టెంబర్ 8న పోటీలు ప్రారంభం

WWE గచ్చిబౌలి స్టేడియంలో కుస్తీలు హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మల్లయుద్ధ పోటీలకు బాగా పేరు గాంచిన సంస్థ డబ్ల్యూడబ్ల్యూఈ కుస్తీ పోటీలు మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో జరుగనున్నాయి. భారత్‌లో ఏడేళ్ల క్రితం ఈ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్‌కు వస్తున్న గ్లోబల్‌ గుర్తింపుతో ఈ పోటీలకు నగరాన్ని వేదికగా ఎంపిక చేశారు. సెప్టెంబర్‌ 8న హైదరాబాద్‌లోని జీఎంసీ బలయోగి స్టేడియంలో కుస్తీ పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత మల్లయోధులు ఈ పోటీలకు హాజరవనున్నారు. రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ […]

  • Publish Date - August 14, 2023 / 02:57 PM IST

WWE

  • గచ్చిబౌలి స్టేడియంలో కుస్తీలు

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మల్లయుద్ధ పోటీలకు బాగా పేరు గాంచిన సంస్థ డబ్ల్యూడబ్ల్యూఈ కుస్తీ పోటీలు మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో జరుగనున్నాయి. భారత్‌లో ఏడేళ్ల క్రితం ఈ పోటీలు నిర్వహించారు.

హైదరాబాద్‌కు వస్తున్న గ్లోబల్‌ గుర్తింపుతో ఈ పోటీలకు నగరాన్ని వేదికగా ఎంపిక చేశారు. సెప్టెంబర్‌ 8న హైదరాబాద్‌లోని జీఎంసీ బలయోగి స్టేడియంలో కుస్తీ పోటీలు ప్రారంభం కానున్నాయి.

ప్రపంచ ప్రఖ్యాత మల్లయోధులు ఈ పోటీలకు హాజరవనున్నారు. రాష్ట్ర క్రీడలు, యువజన శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్, శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్‌, తెలంగాణ క్రీడా అథారిటీ చైర్మన్ డాక్టర్ అంజనేయ గౌడ్ WWE కుస్తీ పోటీల పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయంగా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొన్న 28 రెజ్లర్లు ఈ పోటీల్లో పాల్గొననున్నారని ఆయన తెలియజేశారు.

ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్ సేత్, ఫ్రీకిన్, రొల్లిన్స్, మహిళా ప్రపంచ చాంపియన్ రీహా రిప్లెయ్, డబ్ల్యూడబ్ల్యూఈ టాగ్ టీం చాంపియన్లు సామిజయిన్, కెవిన్ ఓన్స్ తదితరులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

వీరే కాక పెద్ద సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న జిందర్ మహల్, డ్రివ్, ఎంసీ ఇంటైర్, బెకిలించ్, నటల్యా, మట్ రిడిల్, లుడ్విగ్ కైజర్‌తోపాటు అతిరథ మహారథలు ఈ పోటీల్లో పాల్గొనబోతున్నారు.