విధాత: చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షావోమీ మరో కొత్త మొబైల్‌ను తీసుకువస్తున్నది. అదే షావోమీ 14 అల్ట్రా. దీంతో పాటు షావోమీ ప్యాడ్ 7 ప్రో ట్యాబ్‌ను కలిపి లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అయితే, షావోమీ 14 అల్ట్రా ఫోన్ విడుదలకు ముందే ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ మొబైల్‌లో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8.. జెన్ 3 ప్రాసెసర్, ఆడ్రెనో 750 జీపీయూతో వస్తుంది. టాప్ నాచ్ ఫర్ఫార్మెన్స్ ఉంటుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.
అలాగే 12జీబీ ర్యామ్.. 256జీబీ స్టోరేజ్, 16జీబీ ర్యామ్.. 1టీబీ స్టోరేజ్ వేరియంట్స్ ఉంటాయని టాక్. ఇందులో 50ఎంపీ ప్రైమరీ, 50ఎంపీ అల్ట్రా వైడ్‌తో పాటు 32ఎంపీ ఫ్రెంట్ కెమెరా సెటప్ ఉంటుందని టాక్. ఇంకా మొబైల్ 5,180ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్ ఉండడంతో పాటు 120వాట్ వయర్డ్ ఛార్జింగ్, 50వాట్ వయర్లెస్ ఛార్జింగ్ సైతం ఉంటాయని తెలుస్తున్నది. అయితే, ఇందులో వాస్తవం ఎంతన్నది కంపెనీ తెలుపాల్సి ఉంది. అయితే, ఈ మొబైల్ చైనాలోనే లాంచ్ అవుతుందని, భారత్‌లో విక్రయించకపోవచ్ని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో వచ్చిన స్మార్ట్ ఫోన్ సిరీస్‌లను పరిశీలిస్తే తెలుస్తుంది. మరి తొలిసారి సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే.