Site icon vidhaatha

Yadadri Bhuvanagiri | సిరిపురం గ్రామవాసి గాదె కుమార్‌కు డాక్టరేట్ ప్రధానం

Yadadri Bhuvanagiri

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామ నివాసి గాదె కుమార్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డును ప్రకటించింది. రిమోట్ సెన్సింగ్ మరియు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఉపయోగించి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం చుట్టుపక్కల ప్రాంతాలలో భూగర్భ జల వనరుల లభ్యత మరియు నాణ్యత మీద పరిశోధన చేయడం జరిగింది.

ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వై సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి పర్యవేక్షణలో జరిపిన ఈ పరిశోధనకు గాను యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఈ క్రమంలో తనకు పూర్తి సహాయ సహకారాలు అందించిన ఉపాధ్యాయులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు డాక్టర్ గాదె కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version