Yadadri Bhuvanagiri
విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలో భాగంగా 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
మూడు సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం నుండి ముంబైకి గంజాయి తరలిస్తున్న క్రమంలో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రామన్నపేట పోలీసులు తెలిపారు.