YADADRI
విధాత: యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఏడాది మన ఊరు మనబడి కింద తాము దత్తత తీసుకున్న 53 పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సినీ నటులు మంచు లక్ష్మి, మనోజ్ లు యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేల సత్పతిని కోరారు.
మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ సత్పతితో భేటీ అయిన మంచి లక్ష్మి, మనోజ్ లు మన ఊరు మనబడి దత్తత పాఠశాలల స్థితిగతులను పురోగతిని తెలుసుకున్నారు.
విద్యార్థుల అభ్యాసన స్థాయి వివరాలను విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యా బోధన మెరుగుదల పై దృష్టి పెట్టాలని వారు అధికారులను కోరారు.
అంతకుముందు మంచు లక్ష్మి, ఆమె సోదరుడు మనోజ్ దంపతులు, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.