వటపత్ర శాయిగా యాదాద్రి నారసింహుడు

భక్తులను పంచ నారసింహుడిగా అనుగ్రహించే యాదాద్రి లక్ష్మినరసింహుడు వటపత్ర శాయి అవతారంలో పసిబాలుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు.

  • Publish Date - December 27, 2023 / 07:45 AM IST

విధాత : భక్తులను పంచ నారసింహుడిగా అనుగ్రహించే యాదాద్రి లక్ష్మినరసింహుడు వటపత్ర శాయి అవతారంలో పసిబాలుడిగా భక్తులకు దర్శనమిచ్చాడు. యాదాద్రి ప్రధానాలయంలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి వటపత్ర శాయి అలంకార సేవ నిర్వహించారు. ప్రళయ కాలంలో పరమాత్మ బాలముకుందుడిగా మర్రి ఆకుపై పాలకడలిలో పవళించి సృష్టిని ప్రళయం నుంచి రక్షించిన అవతారమే వటపత్ర శాయి అవతారం.


వటపత్ర శాయి అలంకారంలో మాడ వీధుల్లో ఊరేగిన స్వామి వారిని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణలతో పులకించారు. సాయంత్రం వైకుంఠనాథుడి (పరమపదనాధుడి) ఆలంకార సేవ నిర్వహించి తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ప్రధానర్చకులు నంధీగల్ లక్ష్మినరసింహాచార్యులు, ఇంచార్జీ ఈవో రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు