Yasin Malik |
విధాత: నిషేధిత కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత, ఉగ్రవాది అయిన యాసిన్ మాలిక్ భార్య మిషాల్ హుసేన్ మాలిక్ (Mushaal Hussain Malik)కు పాక్ (Pakistan) కేబినెట్‌లో చోటు దక్కింది. ఈ మేరకు ఆ దేశ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అన్వర్ లాల్ ఉల్ హక్ కకర్ నిర్ణయం తీసుకున్నారు.
2022లో జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల కేసుకు సంబంధించి యాసిన్ మాలిక్‌ను ఎన్ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా కకర్ ఎంపిక చేసుకున్న వారితో పాక్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు.
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ సోదరి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మొహమ్మద్ సయీద్ కుమార్తె అయిన రుబాయా సయీద్‌ను 1989లో కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ చేసిన వారిలో మాలిక్ కూడా ఉన్నాడని బాధితురాలు గుర్తు పట్టడంతో జేకేఎల్ఎఫ్‌ను 2009, జులై 15న భారత ప్రభుత్వం నిషేధించింది.