AP | పంచాయతీ ఉప ఎన్నికల్లో YCP జోరు

AP | సర్పంచ్, వార్డు సభ్యుల మెజారిటీ స్థానాలు కైవసం విధాత: ఆంధ్రప్రదేశ్ లో శనివారం జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లో ఫ్యాన్ పైచేయి సాధించింది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది.. ఈసారి మేం అధికారంలోకి రావడం ఖరారైంది అని చెప్పుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో సత్తా చూపలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 సర్పంచు పదవులకు ఎన్నికలు జరిగాయి. అందులో 53 స్థానాలు వైసీపీ, […]

  • Publish Date - August 20, 2023 / 12:15 AM IST

AP |

  • సర్పంచ్, వార్డు సభ్యుల మెజారిటీ స్థానాలు కైవసం

విధాత: ఆంధ్రప్రదేశ్ లో శనివారం జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఉప ఎన్నికల్లో ఫ్యాన్ పైచేయి సాధించింది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది.. ఈసారి మేం అధికారంలోకి రావడం ఖరారైంది అని చెప్పుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో సత్తా చూపలేకపోయారు.

రాష్ట్ర వ్యాప్తంగా 66 సర్పంచు పదవులకు ఎన్నికలు జరిగాయి. అందులో 53 స్థానాలు వైసీపీ, పది టీడీపీ, ఒక స్థానం జనసేనకు దక్కాయి. కాగా.. 1062 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే, ఏకగ్రీవాలతో కలిసి 810 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు విజయం సాధించగా, తెలుగుదేశం 182 స్థానాల్లో, జనసేన బలపర్చిన అభ్యర్థులు ఏడు చోట్ల విజయం సాధించారు.

చంద్రబాబు సారథ్యం వహిస్తున్న కుప్పంలో ఆరు వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగితే, చంద్రబాబు ప్రస్తుతం ఇల్లు నిర్మిస్తున్న శాంతిపురం మండలం, శివపురం వార్డులు సైతం వైసీపీ మద్దతుదారుల ఖాతాలోకి వెళ్ళింది. బాలయ్యబాబు ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో సైతం చలివెందుల పంచాయతీ సర్పంచ్ స్థానం వైసీపీ ఖాతాలోకి వెళ్ళింది.

Latest News