Yuvraj Singh | గుడ్ న్యూస్ చెప్పిన యువ‌రాజ్.. నిద్ర‌లేని రాత్రులు ఆనందంగా మారాయ‌న్న యువీ

Yuvraj Singh | టీమిండియా మాజీ క్రికెట‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆరు బంతుల్లో ఆరు సిక‌ర్స్ కొట్టి త‌న స‌త్తా ఏంటో చూపించిన యువీ భార‌త్‌కి ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించాడు. 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోగా కూడా నిలిచాడు. రిటైర్మెంట్ తీసుకొని ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్న యువీ తాజాగా తన ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పాడు. తాను రెండోసారి తండ్రి అయిన‌ట్టు తెలియ‌జేస్తూ.. పండంటి పాప జ‌న్మించిన‌ట్టు పేర్కొన్నాడు. తమ కుటుంబం పరిపూర్ణమైందని […]

  • Publish Date - August 26, 2023 / 03:16 AM IST

Yuvraj Singh |

టీమిండియా మాజీ క్రికెట‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆరు బంతుల్లో ఆరు సిక‌ర్స్ కొట్టి త‌న స‌త్తా ఏంటో చూపించిన యువీ భార‌త్‌కి ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందించాడు. 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోగా కూడా నిలిచాడు. రిటైర్మెంట్ తీసుకొని ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్న యువీ తాజాగా తన ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పాడు.

తాను రెండోసారి తండ్రి అయిన‌ట్టు తెలియ‌జేస్తూ.. పండంటి పాప జ‌న్మించిన‌ట్టు పేర్కొన్నాడు. తమ కుటుంబం పరిపూర్ణమైందని యువీ సోషల్‌ మీడియా వేదికగా తెలియ‌జేస్తూ ఫ్యామిలీ పిక్ కూడా షేర్ చేశాడు. ఇందులో హజల్‌ కీచ్‌ బాబును చూసుకుంటుండగా.. పాపాయిని ఎత్తుకున్న యువీ ఫోటోకి పోజులిచ్చాడు.

ఇక త‌న ఫోటొకి కామెంట్‌గా.. మా లిటిల్ ప్రిన్సెస్‌ ఆరాకు వెలకమ్, ఆమె రాకతో మా కుటుంబం సంపూర్ణం అయింది. నిద్రలేని రాత్రులు చాలా ఆనందదాయకంగా మారాయి అని యువ‌రాజ్ చెప్పుకొచ్చాడు. ఈ ఆనందం వెల్ల‌క‌ట్ట‌లేద‌ని కూడా అన్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చిన తానిప్పుడు యువ‌రాజ్ తాను కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చాడు.

ఇక ఈ జంట‌కు ఈ జంటకు 2022 జనవరిలో ఓరియ‌న్ పుట్టాడు. కాగా, యువరాజ్ సింగ్, మోడల్ హేజెల్ కీచ్‌ 2016లో వివాహ బంధంతో ఒక్కటయిన విష‌యం విదిత‌మే. వీరి పెళ్లి వేడుకలకు విరాట్ కోహ్లీ, పుజారా, కరుణ్ నాయర్ సహా పలువురు భారత క్రికెటర్లు హాజరై సంద‌డి చేశారు.

2022లో హేజెల్ లీచ్ జనవరిలో పండంటి మగబిడ్డకు జన్మనివ్వ‌గా.. తాజాగా ఈ దంపతులకు ఆడ బిడ్డ జన్మించింది. యువరాజ్ దంపతులు రెండో సారి తల్లిదండ్రులు కావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

2007 టీ 20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న 41ఏళ్ల యువరాజ్ సింగ్ 2019లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శన క‌న‌బ‌ర‌చి భార‌తీయుల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు.

Latest News