Life style | ఆ పని రోజూ చేసే దంపతులకు అనారోగ్యమే దరిచేరదట.. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారట..!

Life style : మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంతో అవసరమో.. శృంగారం కూడా అంతే అవసరం. శృంగారంవ‌ల్ల అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి. వీటన్నింటికి మించి శృంగారంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనే దంప‌తులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారట. ఎందుకంటే నిత్య శృంగారంవల్ల శరీరాలకు వ్యాయామం అవుతుందట.

  • Publish Date - May 19, 2024 / 03:56 PM IST

Life style : మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంతో అవసరమో.. శృంగారం కూడా అంతే అవసరం. శృంగారంవ‌ల్ల అనుభూతి, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి. వీటన్నింటికి మించి శృంగారంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనే దంప‌తులు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారట. ఎందుకంటే నిత్య శృంగారంవల్ల శరీరాలకు వ్యాయామం అవుతుందట. పైగా శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడే హార్మోన్‌లు విడుదలవుతాయట. అందుకే నిత్యం శృంగారాన్ని ఆస్వాదించే దంపతులకు వైద్యుల అవ‌స‌ర‌మే రాద‌ట‌. మ‌రి నిత్య శృంగారం వ‌ల్ల క‌లిగే ఆ ఆరోగ్య ప్రయోజ‌నేలేమిటో, నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవీ ప్రయోజనాలు..

1. రోజూ శృంగారంలో పాల్గొన‌డంవ‌ల్ల హార్మోన్‌ల ప్రభావంతో మానసిక ఒత్తిడి దూరమై మెదడు చురుగ్గా పనిచేస్తుంద‌ట‌.

2. నిత్యం శృంగారం చేయడంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంద‌ట‌. ఎందుకంటే శృంగారంతో శారీరక సంతృప్తి మాత్రమేగాక ఒంట్లో యాంటీబాడీస్ సంఖ్య​పెరుగుతుంద‌ట‌. ఇవి శ‌రీరం వివిధ ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియాల‌ను ఎదుర్కోవ‌డంలో తోడ్పడుతాయట.

3. ఇంకో ముఖ్యమైన విషయం ఏందంటే నిత్య శృంగారంవ‌ల్ల మహిళల శరీరంలో కండరాలు బలంగా తయారవుతాయట‌. యూరిన్​ లీకేజీ​లాంటి సమస్య ఉంటే త‌క్షణ‌మే త‌గ్గిపోతుంద‌ట‌.

4. రోజూ శృంగారంవ‌ల్ల గుండెపోటు రిస్క్ కూడా తగ్గుతుందట‌. సాధారణంగా హార్మోన్‌లు బ్యాలెన్స్ త‌ప్పడంవ‌ల్ల హార్ట్ఎటాక్ వ‌చ్చే ప్రమాదం ఉంటుంది. శృంగారంవ‌ల్ల శరీరంలో ఈస్ట్రోజన్​, టెస్టోస్టిరోన్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయ‌ట‌. దాంతో గుండెపోటు వచ్చే ప్రమాదం త‌గ్గుతుంద‌ట‌.

5. అంతేగాక నిత్యం శృంగారంలో పాల్గొనే జంట‌ల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయ‌ట‌. ఏ ప‌ని చేసినా ఆత్మవిశ్వాసంతో చేస్తార‌ట‌. అదేవిధంగా నిత్య శృంగారం చేసేవారిలో ఎనర్జీ లెవెల్స్​కూడా ఎక్కువగా ఉంటాయ‌ట‌. శరీరం చురుగ్గా పనిచేస్తుందట‌.

6. నిద్రలేమి స‌మ‌స్యకు కూడా నిత్య శృంగారం చ‌క్కని ప‌రిష్కార‌ మార్గమట‌. క్రమం త‌ప్పకుండా శృంగారంలో పాల్గొనడంవల్ల విడుదలయ్యే హార్మోనలతో నిద్రలో నాణ్యత కూడా పెరుగుతుందట‌. శరీరం రిలాక్స్​గా ఉంటుందట‌.

Latest News