Puri Rath Yatra | భువనేశ్వర్ : ఒడిశా( Odisha )లోని పూరీ జగన్నాథ ఆలయం( Puri Jagannath Temple ) వద్ద అపశృతి చోటు చేసుకుంది. జగన్నాథుడి రథయాత్ర(Puri Rath Yatra ) సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భారీ రద్దీ కారణంగా రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. జగన్నాథ్, బలభద్రుడు, సుభద్ర దేవీ రథాలు గుండీచా ఆలయానికి చేరుకున్న వేళ తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు, అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. రథయాత్రలో పాల్గొనేందుకు వేల సంఖ్యలో భక్తుల తరలిరావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. మృతులను ప్రభతిదాస్, బసంతీ సాహు, ప్రేమకాంత్ మొహంతీగా గుర్తించారు. వారంతా ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు, భక్తులు ఆరోపిస్తున్నారు.
STORY | 3 killed, 50 injured in stampede near Shree Gundicha Temple in Odisha’s Puri
READ: https://t.co/DBbESsCYtQ
VIDEO | Visuals from Puri district hospital where injured are being admitted. pic.twitter.com/0b9TLnBZUB
— Press Trust of India (@PTI_News) June 29, 2025