Girl Delivery | బెంగళూరు : తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక( Girl )(17) ప్రభుత్వ పాఠశాల టాయిలెట్( School Toilet )లో ప్రసవించింది. ఈ ఘటన కర్ణాటక( Karntaka ) రాష్ట్రంలోని యాద్గీర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. యాద్గీర్ జిల్లాలోని షాహాపూర్ తాలుకా పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాల( Govt School )లో 17 ఏండ్ల బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. అయితే ఆమె ఈ నెల 27వ తేదీన పాఠశాలకు వెళ్లగా.. అక్కడున్న టాయిలెట్( Toilet )లో బిడ్డకు జన్మనిచ్చింది.
అప్రమత్తమైన ఉపాధ్యాయులు.. బాలికతో పాటు బిడ్డను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే తొమ్మిది నెలల క్రితం ఓ వ్యక్తి బలవంతం చేసి లొంగదీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిన ఏడు నెలలకు ప్రసవించిందని నిర్ధారించారు. లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి వయసు 28 ఏండ్లు అని, అతన్ని గుర్తించామని పోలీసులు తెలిపారు.
నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలిక ఓ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటుంది. దీంతో హాస్టల్ వార్డెన్, స్టాఫ్ నర్సుపై కూడా కేసు నమోదు చేశారు. బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసీ కూడా ఆమె సోదరుడు దాచిపెట్టినట్లు తేలింది. ఇక ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి కూడా బాలిక సరిగా స్కూల్‌కు రావడం లేదని పాఠశాల సిబ్బంది తెలిపారు.