Girl Molest | ముంబై : అభం శుభం తెలియని ఓ అమ్మాయి( Girl Molest )పై కామాంధులు చెలరేగిపోయారు. క్రూర మృగల్లా మాదిరి ఆ బాలికపై విరుచుకుపడ్డారు. మూడు నెలల వ్యవధిలో ఆమెపై 200 మంది లైంగికదాడి( Molest )కి పాల్పడ్డారు. వినడానికే భయంకరంగా ఉన్న ఈ ఘటన మహారాష్ట్ర( Maharashtra )లోని పాల్ఘర్ జిల్లా( Palghar district )లో వెలుగు చూసింది.
పోలీసులు, ఎన్జీవోల కథనం ప్రకారం.. బంగ్లాదేశ్( Bangladesh )కు చెందిన ఓ అమ్మాయి ఓ సబ్జెక్టులో ఫెయిలవడంతో భయంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. అదే దేశానికి చెందిన ఓ మహిళ.. బాలికను చేరదీసి అక్రమంగా ఇండియాకు తరలించింది. మొదట గుజరాత్( Gujarat )కు తరలించి.. అక్కడ బాలికను వ్యభిచారం చేయించారు. అనంతరం అటు నుంచి మహారాష్ట్ర( Maharashtra )లోని పాల్ఘర్ జిల్లా( Palghar district )కు తరలించి, వ్యభిచార గృహాల్లో ఆమెను నిర్బంధించారు.
ఇక పాల్ఘర్ జిల్లాలో మూడు నెలల వ్యవధిలోనే ఆమెపై 200 మంది లైంగికదాడికి పాల్పడ్డారు. పాపం బాలిక అని కూడా చూడకుండా ఆమె శరీరంలోకి హర్మోనల్ ఇంజెక్షన్లు ఎక్కించారు. రకరకాలుగా ఆమె హింసకు గురి చేశారు. మత్తు పానీయాలు ఇచ్చి బాలికపై లైంగికదాడికి పాల్పడి రాక్షసానందం పొందారు.
అయితే జులై చివరి వారంలో వ్యభిచార గృహాలపై ఎన్జీవోలు, పోలీసులు దాడులు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. బాలికను కామాంధుల నుంచి రక్షించారు. వ్యభిచార గృహాలపై దాడులు చేసి.. బాలికను నిర్బంధించిన ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఆరుగురితో పాటు లైంగికదాడికి పాల్పడ్డ 200 మందిని కఠినంగా శిక్షించాలని ఎన్జీవోలు డిమాండ్ చేశారు.