తల్లి, ఏనుగు మందలు వదిలేసిన పిల్ల ఏనుగు … అటవీ శాఖ సిబ్బంది సంరక్షణ

కోయంబత్తూరు పరిధిలోని నీలగిరి జిల్లా ముదుమలై టైగర్ రిజర్వ్ (ఎంటీఆర్)లోని తెప్పక్కడు వద్ద ఉన్న ఏనుగుల శిబిరానికి ఆదివారం తమ సంరక్షణలో ఉన్నపిల్ల ఏనుగును తల్లి ఏనుగుతో కలిపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లుగా అటవీ అధికారులు తెలిపారు

  • Publish Date - June 10, 2024 / 05:00 PM IST

విధాత, హైదరాబాద్ : కోయంబత్తూరు పరిధిలోని నీలగిరి జిల్లా ముదుమలై టైగర్ రిజర్వ్ (ఎంటీఆర్)లోని తెప్పక్కడు వద్ద ఉన్న ఏనుగుల శిబిరానికి ఆదివారం తమ సంరక్షణలో ఉన్నపిల్ల ఏనుగును తల్లి ఏనుగుతో కలిపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లుగా అటవీ అధికారులు తెలిపారు. ఒంటరిగా ఉన్న మూడు నెలల మగ ఏనుగు పిల్లను తన తల్లి వద్దకు చేర్చేందుకు ఫ్రంట్‌లైన్ అటవీ సిబ్బంది మొత్తంగా 11సార్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారు ఏనుగు దూడను తల్లి ఏనుగుతో, ఇతర ఏనుగు మందలతో కలపడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అటవీ అధికారులు ఇప్పుడు ఆ దూడను అనమలై టైగర్ రిజర్వ్ లేదా ముదుమలై టైగర్ రిజర్వ్ లోని ఏనుగుల శిబిరానికి పంపడానికి చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ అనుమతిని కోరారు.

కోయంబత్తూరు అటవీ రేంజ్‌లోని మరుధమలై పాదాల వద్ద అనారోగ్యంతో ఉన్న తల్లి ఏనుగుతో దూడ మొదటిసారి కనిపించిందని అధికారి తెలిపారు. తల్లి ఏనుగుకు చికిత్స అందిస్తున్నప్పుడు ఆ మూడు రోజులు తన తోబుట్టువుతో కలిసిన పిల్ల ఏనుగు మిగతా ఏనుగుల గుంపుతో కలిసిపోయింది. తల్లి ఏనుగు కోలుకున్నాక దానిని అడవిలో విడిచిపెట్టారు. ఇంతలో దూడను ఏనుగు గుంపు వదిలేసింది. తల్లి ఏనుగును గుర్తించి ఏనుగు దూడను దాని వద్దకు తీసుకెళ్లగా దానిని దగ్గర తీసుకునేందుకు తల్లి ఏనుగు నిరాకరించింది అటు ఇతర నాలుగు ఏనుగు మందలు కూడా దూడను తిరస్కరించాయని ఆ అధికారి తెలిపారు. ఏనుగు దూడకు వైద్య పరీక్షలు నిర్వహించి ముదుమలై టైగర్ రిజర్వ్ (ఎంటీఆర్)లోని తెప్పక్కడు వద్ద ఉన్న ఏనుగుల శిబిరానికి తరలించారు. ఇక్కడ 27 పెద్ద ఏనుగులు, మూడు ఏనుగు దూడలు ఉన్నాయి.

Latest News