విధాత: చాలా మంది మందికి పర్సనల్ లోన్, హోంలోన్, బిజినెస్ లోన్, గోల్డ్ లోన్ ఎక్కువగా అవగాహన ఉంటుంది. లోన్ గురించి తెలియకపోవచ్చు. అదే ‘సిగ్నేచర్ లోన్. చాలా మంది కొత్తగా ఈ లోన్ గురించి విని ఉంటారు. ఈ లోన్ తీసుకున్న వారికి ఒక్క సంతకం చేస్తే చాలు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తుంటాయి. అయితే, ఈ లోన్‌కు అందరూ అర్హులు కాదన్నది గుర్తు పెట్టుకోవాలి. కేవలం కొద్ది మందికి మాత్రమే బ్యాంకులు ఈ లోన్‌ను మంజూరు చేస్తుంటాయి. ఈ రుణ సదుపాయాన్ని ‘క్యారెక్టర్ లోన్’గానూ పిలుస్తుంటారు.
వాస్తవానికి సిగ్నేచర్ లోన్ అనేది ఓ రకమైన పర్సనల్ లోన్‌లాంటిదే. బ్యాంకులు ఎలాంటి పూచీకత్తూ లేకుండా రుణాన్ని మంజూరు చేస్తుంటాయి. అయితే, ఈ లోన్‌కు వడ్డీ రేటు సైతం భారీగా ఉంటుంది. క్రెడిట్ కార్డు వడ్డీరేటుతో పోలిస్తే మాత్రం తక్కువగాను ఉంటుంది. ఈ సిగ్నేచర్ లోన్ కోసం రుణగ్రహీతలు మొదట బ్యాంకు విశ్వాసాన్ని సంపాదించాల్సి ఉంటుంది. లోన్ బ్యాంకులు జారీ చేయాలంటే క్రెడిట్ స్కోర్ 580 నుంచి 700 వరకు క్రెడిట్‌స్కోర్ ఉండాలి.
అలాగే.. నెలవారీ వాయిదా చెల్లింపుల విషయంలో ఆదాయం సైతం చూపించాల్సి ఉంటుంది. తీసుకున్న రుణం తప్పక చెల్లిస్తామనే హామీని బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ తరఫున ఓ వ్యక్తి పూచీకత్తుగా సంతకం చేయాల్సి ఉంటుంది. ఒకసారి సిగ్నేచర్ లోన్ తీసుకుని పూర్తిగా లోన్ చెల్లించిన తర్వాత బ్యాంకులు మరోసారి లోన్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఏదైనా వ్యక్తిగత అవసరాలు, ఇంటి మరమ్మతులు, ఆసుపత్రి బిల్లులు, విహార యాత్రలు ఇలా ఏ అవసరానికైనా లోన్ తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.