Budget 2026 | ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను (ఆదివారం నాడు సభ జరిగింది. (Union Budget 2026) ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. జనవరి 28 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రెండు దఫాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఆర్థిక సర్వేను జనవరి 29న సభలో ఉంచుతారు. ఏటా మాదిరిగానే ఈసారి కూడా ఫిబ్రవరి 1న బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
అయితే, ఫిబ్రవరి 1 ఆదివారం సెలవు కావడంతో దీనిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCPA) నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే, బడ్జెట్ ఫిబ్రవరి 1నే ఎందుకన్న దానిపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనిపై తెగ చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫిబ్రవరి 1నే ఎందుకన్నదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఫిబ్రవరి 1నే ఎందుకు..?
పలు నివేదికల ప్రకారం.. గతంలో కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజున సమర్పించేవారు. దీనివల్ల బడ్జెట్ ఆమోద ప్రక్రియ ఆలస్యమయ్యేది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి ప్రభుత్వ ఖర్చుల కోసం భారత కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను ఉపసంహరించుకునేందుకు వీలుగా పార్లమెంట్ ‘ఓట్ ఆన్ అకౌంట్’ను ఆమోదించాల్సి వచ్చేది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు శాఖాపరమైన డిమాండ్లను వివరంగా పరిశీలించిన తర్వాత, మిగిలిన సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ఆమెదించేవారు. ఇది తీవ్ర జాప్యాలకు దారితీస్తుండటంతో.. దీన్ని నివారించేందుకు 2017లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. దీనివల్ల ఏప్రిల్ 1న ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే మార్చి 31లోపే బడ్జెట్ ఆమోద ప్రక్రియ పూర్తి చేయడానికి పార్లమెంటుకు తగినంత సమయం లభిస్తుంది.
బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి..
వారాంతాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం కొత్తేమీ కాదు. 2016 తొలిసారి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్‌ను ఆదివారమే ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2025లో బడ్జెట్‌ను నిర్మలమ్మ శనివారం ప్రవేశపెట్టారు. గతంలో ఆదివారాల్లో పార్లమెంట్ సమావేశమైన సందర్భాలు కూడా ఉన్నాయి. కరోనా సమయంలో (2020), అలాగే పార్లమెంట్ తొలి సమావేశం 60వ వార్షికోత్సవం సందర్భంగా 2012, మే13వ తేదీన ఆదివారం నాడు సభ జరిగింది.
ఇవి కూడా చదవండి :
Donald Trump | ట్రంప్ మరో సంచలనం.. భారత్‌పై 500 శాతం సుంకాలు..?
Karnataka | రూ. 5 వేలకు ఆశపడి.. కూతురి చేత వ్యభిచారం చేయించిన తండ్రి
