విధాత : ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేతలతో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక భేటి నిర్వహించారు .ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు హాజరయ్యారు.
ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది. రెండేళ్ల కాంగ్రెస్ పాలన, పార్టీ బలోపేతంపైన, సంక్షేమ పథకాలు అమలుపైన చర్చించారు. అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలపైన ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ కు ప్రజెంటేషన్ ఇచ్చి వివరించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, మండల, జిల్లా పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై కీలక చర్చలు సాగినట్లుగా సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో త్వరలో జరుగునున్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ నెల23న జరుగబోయే తెలంగాణ కేబినెట్ భేటీ, 26 నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అంశాలపై కూడా ఈ సందర్బంగా చర్చించినట్లుగా సమాచారం.
ఢిల్లీకి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
కాంగ్రెస్ హైకమాండ్ ను కలిసేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి రైలులో ఢిల్లీ బయలుదేరారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎన్నికలు జరుగాల్సిన రెండు స్థానాలకు సీనియర్ నాయకులు వీహెచ్, జెట్టి కుసుమకుమార్‌లకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరనున్నట్లుగా జగ్గారెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
Kavitha : కవిత కొత్త పార్టీకి మూహుర్తం ఖరారు !
MA Marathi course | 78 ఏళ్ల వయసులో ఎంఏలో గోల్డ్ మెడల్ సాధించి.. వయసు విజయానికి అడ్డుకాదని నిరూపించింది..
