Kavitha : కవిత కొత్త పార్టీకి మూహుర్తం ఖరారు !
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు కల్వకుంట్ల కవిత ముహూర్తం ఖరారు చేశారు. మే మొదటి వారంలో పార్టీ ప్రకటిస్తామని వెల్లడించారు. సిద్దిపేట, బోధన్ నుంచి పోటీ సంకేతాలు ఇచ్చారు.
విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ బహిష్కృత నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు మూహుర్తాన్ని ప్రకటించారు. మేనెల మొదటి వారంలో మంచి మూహుర్తం చూసుకుని తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లుగా తెలిపారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని కవిత వెల్లడించారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. ఫస్ట్ ఛాయిస్ సిద్దిపేట, రెండో ఛాయిస్ బోధన్ అని కవిత తెలిపారు. మీడియాతో చిట్ చాట్ లో కవిత మాట్లాడారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఉండదని, ప్రధాన ప్రతిపక్షంగా జాగృతి పెట్టబోయే పార్టీ ఉంటుందని, రాబోయే రోజుల్లో మేము పక్కా అధికారంలోకి వస్తాం అని కవిత ధీమా వ్యక్తం చేశారు.
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్బంగా కవిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కార్మిక చట్టాలను అమలు చేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు వందలాది కార్మికులను అన్యాయంగా ఆర్టీసీ ఉద్యోగాల నుంచి తొలగించారని కవిత ఆరోపించారు. వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆందోళన చేపడుతామన్నారు. ఆర్టీసీకి ఇప్పుడు యూనియన్లు లేవు..చైర్మన్ కూడా లేకపోవడం దారుణమన్నారు. బీఆర్ఎస్ కర్ణాటకకు తరలించిన బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ ను తిరిగి పునరుద్దరించే చర్యలు చేపట్టాలని కోరారు. ఫ్రీ బస్ స్కీమ్ కు మహిళలతో పాటు అంతా అసంతృప్తిలో ఉన్నారన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నాలను ప్రజలు ప్రతిఘటిస్తారన్నారు. మెఘా సంస్థకు ఆర్టీసీని ధారదత్తం చేసే కుట్ర జరుగుతుందని, ఇందులో భాగంగానే ఎలక్ట్రికల్ బస్సులను పెంచుతూ ప్రైవేటీకరణ దిశగా అడుగులేస్తుందన్నారు. కేంద్రం ఆర్టీసీకి ఇచ్చే గ్రాంటులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ను ఢిల్లీకి తీసుకెళ్లారన్న హరీష్ రావు వ్యాఖ్యలపై కవిత సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లేదని..ఇప్పుడు ఢిల్లీకి వెలుతుందన్నారు. కేటీఆర్ ఉద్యమ ద్రోహుల వ్యాఖ్యలపై స్పందించిన కవిత ఎవరు ఉద్యమ ద్రోహులో ప్రజలు నిర్ణయిస్తారన్నారు.
వైఎస్ షర్మిలను ఇందిరా గాంధీతో పోల్చిన కల్వకుంట్ల కవిత ఏపీలో షర్మిల ఫెయిల్ అవ్వలేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యిందని గుర్తు చేశారు. లీడర్ కి జెండర్ బేధాలు ఉండవని.. ఇందిరా గాంధీ ఒక పవర్ ఫుల్ లీడర్ అని..తెలంగాణ రాజకీయాల్లో మా కొత్త పార్టీ స్వీయ రాజకీయ శక్తిగా ఎదుగబోతుందన్నారు.
ఇవి కూడా చదవండి :
MA Marathi course | 78 ఏళ్ల వయసులో ఎంఏలో గోల్డ్ మెడల్ సాధించి.. వయసు విజయానికి అడ్డుకాదని నిరూపించింది..
నడుస్తుంది, గాలిలో ఎగురుతుంది.. ఈ వింత చేపను ఎప్పుడైనా చూశారా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram