Man Urinates | ఇప్పటి వరకు చాలా మంది కార్లలో( Cars ) తిరుగుతూ అనేక రకాల స్టంట్లకు పాల్పడ్డారు. ఈ యువకుడు మాత్రం ఎవరూ ఊహించని విధంగా.. అందరూ సిగ్గుపడే విధంగా ఓ నీచమైన పని చేశాడు. నడిరోడ్డుపై దూసుకెళ్తున్న థార్ కారు( Thar Car ) డోర్ తెరిచి నిలబడ్డాడు. ఇక సిగ్గు లేకుండా ప్యాంట్ విప్పి కదులుతున్న కారులో నుంచి నడిరోడ్డుపై మూత్ర విసర్జన( Urinates ) చేశాడు.
ఈ దృశ్యాన్ని వెనుకాల వెళ్తున్న కారులోని కొందరు చిత్రీకరించారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ఆధారంగా పోలీసులు థార్ కారును గుర్తించి, అందులో ప్రయాణించిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.
ఈ ఘటన గురుగ్రామ్‌లోని సదర్ బజార్( Sadar Bazaar )లో బుధవారం రాత్రి చోటు చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. హర్యానా( Haryana )లోని ఝజ్జర్ ఏరియాకు చెందిన మోహిత్(23), అనూజ్(25)ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మోహిత్ కారు డ్రైవింగ్ చేస్తుండగా, అనూజ్ మూత్ర విసర్జన చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరిని శుక్రవారం అరెస్టు చేశామన్నారు. కారును కూడా సీజ్ చేశామన్నారు.
అయితే థార్ కార్ మోహిత్‌ది అని పోలీసులు తెలిపారు. మోహిత్‌పై హత్య కేసుతో పాటు ఆయుధ చట్టం కింద కేసు నమోదైందని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుల్లో అతను జైలు పాలైనప్పటికీ 2022 డిసెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యాడు.
गुरुग्राम में चलती थार से पेशाब किया, मोहित और अनुज गिरफ्तार !!
मोहित गाड़ी चला रहा था, अनुज ने पेशाब किया। pic.twitter.com/Bmbe5orKG7
— Sachin Gupta (@SachinGuptaUP) October 24, 2025
