Site icon vidhaatha

Murder | 2 కిలోల వెండి క‌డియాల కోసం.. వృద్ధురాలి కాళ్ల‌ను న‌రికేశారు..

Murder | జైపూర్ : ఓ వృద్ధురాలు( Old age Person ) త‌న కాళ్ల‌కు 2 కిలోల వెండి క‌డియాలు( Silver Anklets ) ధ‌రించింది. ఆ క‌డియాల మీద క‌న్నేసిన దొంగ‌లు( Thieves ).. ఆమెను హ‌త‌మార్చి అప‌హ‌రించారు. ఈ దారుణ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌( Rajasthan )లోని సవాయి మ‌ధోపూర్ జిల్లాలో ఆదివారం ఉద‌యం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. స‌వాయి మ‌ధోపూర్ జిల్లా బ‌మ‌న్‌వాస్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ గ్రామానికి చెందిన ఊర్మిళ మీనా(50) ఆదివారం తెల్ల‌వారుజామున త‌న పొలం వ‌ద్ద‌కు వెళ్లింది. ఉద‌యం 11 గంట‌లైనా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ స‌భ్యులు వ్య‌వ‌సాయ పొలం వ‌ద్ద‌కు వెళ్లి చూడ‌గా, ర‌క్త‌పు మ‌డుగులో ప‌డిన ఊర్మిళ మీనాను చూసి షాక‌య్యారు.

ఊర్మిళ హ‌త్య‌పై బ‌మ‌న్‌వాస్ పోలీసుల‌కు కుటుంబ స‌భ్యులు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. ఊర్మిళ‌ను గొంతు నులిమి చంపిన‌ట్లు నిర్ధారించారు. కాళ్ల‌కు ఉన్న 2 కిలోల క‌డియాల కోసం కాళ్ల‌ను న‌రికేసి, వాటిని దొంగిలించిన‌ట్లు తెలిపారు. ఇక కాళ్ల‌ను స్థానికంగా ఉన్న చెరువులో ప‌డేయ‌గా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఊర్మిళ‌ను మ‌ర్డ‌ర్ చేసిన నిందితుల‌ను అదుపులోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ.. స్థానిక ర‌హ‌దారిపై డెడ్‌బాడీతో గ్రామ‌స్తులు ఆందోళ‌న‌కు దిగారు. నిందితుల‌ను గుర్తించేందుకు క‌నీసం మూడు రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని పోలీసులు తెల‌ప‌గా, అప్ప‌టి వ‌ర‌కు మృత‌దేహంతో రోడ్డుపైనే ఉంటామ‌ని చెప్పారు.

Exit mobile version