మ‌ద్యానికి డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని.. క‌త్తితో పొడిచి చంపాడు

  • Publish Date - October 23, 2023 / 06:09 AM IST

విధాత : మ‌ద్యం తాగేందుకు డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని, ఓ వ్య‌క్తిని క‌త్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానే సిటీలో ఆదివారం తెల్ల‌వారుజామున చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. థానేకు చెందిన 29 ఏండ్ల యువ‌కుడు స్థానికంగా వెల్డ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. అయితే ఆదివారం తెల్ల‌వారుజామున ఒంటి గంట స‌మ‌యంలో కాల‌కృత్యాల నిమిత్తం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు ఆ యువ‌కుడు.


అయితే దారిలో 32 ఏండ్ల వ‌య‌సున్న ఓ వ్య‌క్తి తార‌స‌ప‌డ్డాడు. అదే ఏరియాకు చెందిన ఆ వ్య‌క్తి డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. త‌న‌కు మ‌ద్యం సేవించేందుకు న‌గ‌దు ఇవ్వాల‌ని డ్రైవ‌ర్.. వెల్డ‌ర్‌ను అడిగాడు. డ‌బ్బులు ఇచ్చేందుకు వెల్డ‌ర్ తిర‌స్క‌రించ‌డంతో.. అక్క‌డిక‌క్క‌డే క‌త్తితో పొడిచి చంపాడు. స్థానికులు వెల్డ‌ర్‌ను గ‌మనించి, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు, మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు త‌ర‌లించారు.