tree climbing bike| ఆహా! ఈ మిషన్ గీత కార్మికులకు ఇస్తే బెటర్ !

కొబ్బరి, తాటి చెట్లను ఎక్కే కార్మికులను ప్రమాదం భారీ నుంచి రక్షించేందుకు..చెట్టుపైకి ఎక్కి కాయల కోత, కల్లుగీతలను సులభంగా చేసేందుకు తాజాగా ఓ కొత్త మిషన్ ప్రయోగం సరికొత్త ఆశాకిరణంగా కనిపిస్తుంది. కొబ్బరి చెట్లపైకి ఎక్కి కాయల కోత పనులు చేసి..కిందకు తీసుకురావడానికి మోటార్ సైకిల్ వంటి ఓ మిషన్ 'అరేకా బైక్' అందుబాటులోకి వచ్చింది. గీత కార్మికులకు కూడా ఇది ప్రయోజనకరంగా కనిపిస్తుంది.

విధాత : కొబ్బరి , తాటి చెట్లను ఎక్కడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. కార్మికులు కొబ్బరి, తాటి చెట్లను ఎక్కి వాటి కాయలను కోయడం..కల్లు గీయడం వంటి పనులను చేసే క్రమంలో చెట్లపై నుంచి జారీ పడి ప్రాణాలు పోగోట్టుకోవడం, అంగవైకల్యాలకు గురి కావడం జరుగుతుంది. ఈ పనులను ప్రాణాపాయం లేకుండా నిర్వహించుకునేలా ఇప్పటివరకు ఎన్నో పరికరాలు తెచ్చిన పెద్దగా ప్రయోజనం కల్గించలేకపోతున్నాయి. తెలుగు రాష్ట్రలలో కాటమయ్య రక్ష కిట్ వంటి పరికరాలు కొంత మేరకు సత్ఫలిస్తున్నప్పటికి ప్రమాదాలు..ప్రాణ నష్టాలు మాత్రం ఆగడం లేదు.

కొబ్బరి, తాటి చెట్లను ఎక్కే కార్మికులను ప్రమాదం భారీ నుంచి రక్షించేందుకు..చెట్టుపైకి ఎక్కి కాయల కోత, కల్లుగీతలను సులభంగా చేసేందుకు తాజాగా ఓ కొత్త మిషన్ ప్రయోగం సరికొత్త ఆశాకిరణంగా కనిపిస్తుంది. కొబ్బరి చెట్లపైకి ఎక్కి కాయల కోత పనులు చేసి..కిందకు తీసుకురావడానికి మోటార్ సైకిల్ వంటి ఓ మిషన్ ‘అరేకా బైక్’ అందుబాటులోకి వచ్చింది. చెట్టుపైకి అచ్చం మోటార్ సైకిల్ మాదిరిగా ప్రయాణిస్తున్న ఈ “ట్రీ క్లైంబింగ్ బైక్” మిషన్ తో కార్మికుడు సీటుపై కూర్చుని సునాయసంగా పైకి వెళ్లి కిందకు దిగుతూ తన పనులు సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ మిషన్ గీత కార్మికులకు కూడా అందుబాటులోకి వస్తే కల్లుగీతలో, ముంజలు, తాటిపండ్ల కోత పనులను ప్రాణాపాయం లేకుండా చేసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని గీత కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

కర్ణాటకలోని కోమలే గ్రామానికి చెందిన గణపతి భట్ తన స్నేహితుడు షార్విన్ మాబెన్‌తో కలిసి ‘అరేకా బైక్’ను ఆవిష్కరించారు. ఇది ఒక లీటరు పెట్రోల్‌తో 90 చెట్లను ఎక్కగలదు. కూలీల ఖర్చులను 20 శాతం తగ్గించడంతో పాటు సమయాన్ని ఆదా చేస్తుంది.
ఇందులో సేఫ్టీ బెల్టులతో కూడిన గొలుసుతో నడిచే పరికరం. ఆపరేటర్ కూర్చునే సీటు, డబుల్ బ్రేక్‌లు (ఇంజిన్ బ్రేక్ మరియు అత్యవసర డిస్క్ బ్రేక్), ఆపరేటర్ పడిపోకుండా నిరోధించడానికి రూపొందించిన దృఢమైన యంత్రాంగం ఉన్నాయి. చిన్న సీట్లు మరియు హ్యాండిల్‌బార్‌లతో రూపొందించబడింది. ఇది వాడుకలో సౌలభ్యం కోసం రూపొందించబడింది, తరచుగా ఒకే ఆపరేటర్ చెట్టుపై యంత్రాన్ని సరిచేసి ఆపరేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. రూ. 59,000 ఖర్చతో ఈ అరేకా బైక్ ను రూపొందించిన గణపతి వందలాది బైక్ లను ఔత్సాహిక రైతులకు అందచేసినట్లుగా తెలిపాడు.

 

Latest News