Site icon vidhaatha

Sambit Patra | మహాప్రభు జగన్నాథా క్షమించు-సంబిత్‌ పాత్ర

భువనేశ్వర్‌- జగన్నాథ మహాప్రభు ప్రధాని నరేంద్రమోడీకి భక్తుడు అని పొరపాటుగా చెప్పానని, తన తప్పిదానికి క్షమించాలని పూరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత సంబిత్‌ పాత్ర మంగళవారం నాడు ఎక్స్‌ ద్వారా వివరణ ఇచ్చారు. -నేను నేడు చేసిన ఒక ప్రకటన వివాదాస్పదమైంది. పూరీలో నరేంద్ర మోడీ రోడ్డు యాత్ర తర్వాత నేను పలు చానెళ్లతో మాట్లాడాను. నరేంద్ర మోడీ మహాప్రభుకు గొప్ప భక్తుడని అన్ని చానెళ్లకు చెప్పాను. చివరకు మరో చానెల్‌వారు నా బైట్‌ తీసుకున్నప్పుడు చాలా రద్దీగా, గందరగోళంగా ఉంది.

వాతావరణం కూడా చాలా ఉక్కపోతగా ఉంది. ఆ హడావిడిలో తెలియకుండానే, అంతకుముందు చెప్పిన దానికి విరుద్ధంగా, మహాప్రభు నరేంద్ర మోడీకి భక్తుడని చెప్పాను. ఇది నిజంగా తప్పు. సోయి ఉన్నవారెవరూ మనిషికి దేవుడు భక్తుడని చెప్పరు. నేను ఎటువంటి దురుద్దేశాలు లేకుండా ఈ విషయం చెప్పాను. నా వ్యాఖ్యలు కొందరిని గాయపరిచి ఉండవచ్చు. కానీ తెలియకుండా చేసిన వ్యాఖ్యలకు నన్ను క్షమించమని కోరుతున్నాను. నేను ఇలా నోరు జారినందుకు నన్ను క్షమించమని మహాప్రభును వేడుకుంటున్నాను- అని సంబిత్‌ పాత్ర పేర్కొన్నారు.

Exit mobile version