NEET UG 2024 | నీట్ పేపర్ లీక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో ఆదివారం సీబీఐ నీట్ పేపర్ లీక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నీట్ పై వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని సీబీఐ నిర్ణయించింది

  • Publish Date - June 23, 2024 / 04:59 PM IST

కేసు సమగ్ర దర్యాప్తుకు నిర్ణయం

విధాత : నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో ఆదివారం సీబీఐ నీట్ పేపర్ లీక్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నీట్ పై వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని సీబీఐ నిర్ణయించింది. బీహార్‌లో జరిగిన పేపర్ లీక్‌తో పాటు 1500మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులపై విచారణ చేయనుంది. కేంద్ర విద్యా శాఖ సూచనల మేరకు నమోదు చేసిన ఈ కేసులో నిందితులుగా గుర్తు తెలియని వ్యక్తులను చేర్చినట్లు సీబీఐ తెలిపింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్‌ పరీక్షలో అక్రమాలు మోసాలు జరిగాయని పలుచోట్ల కేసులు నమోదు అయినట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కోంది.

దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం పరీక్షల ప్రక్రియలో పారదర్శక కోసం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసేందుకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆదివారం జరుగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. ఎన్టీఏ డైరక్టర్ జనరల్ సుబోద్‌సింగ్‌కు ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ ఐటీపీవో చైర్మన్ ఎండీ ప్రదీప్‌సింగ్ ఖరోలాకు ఎన్టీఏ బాధ్యతలు చేపట్టింది. ఎన్టీఏ సంస్కరణకు ఇస్రో మాజీ చైర్మన్ కే.రాథాకృష్ణన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది.

Latest News