Site icon vidhaatha

Chhattisgarh | బీజాపూర్ జిల్లాలో జవాన్లకు తప్పిన ప్రమాదం

ఐఈడీ బాంబును గుర్తించి నిర్వీర్యం చేసిన బలగాలు

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల (Maoist) ఏరివేత ఆపరేషన్లలో ఉన్న జవాన్లకు పెను ప్రమాదం తప్పింది. జవాన్లను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన పైప్ బాంబులను (IED) భద్రతా బలగాలు గుర్తించడంతో భారీ ప్రాణ నష్టం తప్పినట్లయ్యింది. బీజాపూర్ జిల్లా చిన్నగులూరు పరిధిలోని అటవీ ప్రాంతంలో 250 మీటర్లు పొడవున్న వైరుతో కనెక్ట్ చేసిన అత్యంత ప్రమాదకరమైన బాంబుతో జవాన్లపై దాడి చేసేందుకు మావోయిస్టులు పథకం వేశారు.

ముందస్తుగా భధ్రత బలగాలు ఐఈడీ బాంబును గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో ఇప్పటికే చత్తీస్‌ఘడ్‌ అడవుల్లో మావోయిస్టుల ఏరివేతకు గాలింపు చర్యలు, దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా 150మంది వరుకు మావోయిస్టులు బలగాల చేతుల్లో హతమయ్యారు. కగార్‌ ఆపరేషన్‌తో చత్తీస్‌ఘడ్‌ అడవులు నిత్య మారణ హోమాన్ని తలపిస్తున్నాయి.

Exit mobile version