హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విధాత): ములుగు జిల్లా, దంతెవాడ అడవుల్లో మందుపాతర పేలింది. ఈ ఘటనలో ఓ జవాన్ రెండు కాళ్లు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. దంతె వాడ అడవుల్లో మావోయిస్టులు అమర్చిన మందు పాతరలు వెతికి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో తాడ్వాయి మండలం భూపతిపూర్‌కు చెందిన జవాన్ అల్లం ముకేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఒక్కసారిగా మందుపాతర పేలడంతో అతని రెండు కాళ్లు కోల్పోయాడు. కాగా కేంద్రం మావోయిస్టులను తుదిముట్టించేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో.. మావోయిస్టు ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Chhattisgarh : మందుపాతర పేలడంతో కాళ్లు కోల్పోయిన జవాన్
